జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ప్రభుత్వంలో జగన్ కోవర్టు మంత్రులు... సుధాకర్ బాబు (Covert Ministers | Congress | Sudhakar Babu | Jagan)
FILE
ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూనే కాంగ్రెస్ కొంప కొల్లేరు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ బలోపేతానికి ఏడుగురు మంత్రులు సహాయసహకారాలు అందిస్తున్నారని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ఈ జాబితాను పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణకు ఆయన అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోవర్టు మంత్రులతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. తక్షణమే ఈ ఏడుగురు కోవర్టులను మంత్రి పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. బొత్సకు ఇచ్చిన ఫిర్యాదులో కోవర్టు మంత్రులెవరన్న విషయాలను ప్రస్తావించలేదు.

కాకపోతే, తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంత్రి, గుంటూరు నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారని ఆయన అన్నారు. మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహాయసహకారాలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

సమయం వచ్చినపుడు ఆ ఏడుగురు మంత్రులు, ఎవరెవరితో ఎప్పుడు ఎలా మాట్లాడారో డేటాను విడుదల చేస్తామని అన్నారు. మంత్రుల ఫోన్ కాల్ డేటాను చూస్తే వారు వ్యవహారం బట్టబయలవుతుందన్నారు.
సంబంధిత సమాచారం
Feedback Print