జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఇస్కాన్ ఆలయంలో అత్యాచారాలు : మంత్రి నాగేందర్ (Iskcon Hyderabad | Minister Danam Nagendar | Hyderabad)
danam nagendar
File
FILE
హైదరాబాద్‌లోని ఇస్కాన్ ఆలయంలో పూజలకు వెళ్లే యువతుల పట్ల ఇస్కాన్ ప్రతినిధులు అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. ఇలాంటివి తాము సహించబోమని ఆయన తేల్చిచెప్పారు.

ఇస్కాన్ ఆలయంలో తనపై అత్యాచారం చేసినట్టు ఒక యువతి రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొంతమంది స్థానికులతో కలిసి మంత్రి దానం అక్కడకు చేరుకుని ధర్నా చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ దురుసుగా ప్రవర్తించారు.

ఈ సందర్భంగా మంత్రి దానం మాట్లాడుతూ తాము ప్రజా ప్రతినిధులమని, ప్రజల తరపున ఎన్నికైన తాము ప్రజలు ఏదైనా హాని జరుగుతుందని తెలిస్తే ఎలాంటి రూల్స్‌నైనా బ్రేక్ చేస్తామన్నారు. గతంలో కూడా ఇస్కాన్ ప్రతినిధులు ఆలయానికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు, ఇస్కాన్ ప్రతినిధి ఒకరు యువతిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్టు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయని దానం గుర్తు చేశారు.
సంబంధిత సమాచారం
Feedback Print