జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ప్రధానమంత్రి తెలంగాణకు వ్యతిరేకం: మధు యాష్కీ (Telangana | Manmohan | Madhuyashki)
FILE
తెలంగాణ ఏర్పాటుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యతిరేకి అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మధుయాష్కీ సంచలన వ్యాఖ్య చేశారు. ప్రధానమంత్రి వ్యతిరేకంగా ఉండటం వల్లనే రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణలోనే తెలంగాణను వ్యతిరేకించేవారు ఉండటం శోచనీయమనీ, రేణుకా చౌదరి, మర్రి శశిధర్ రెడ్డి వంటి నాయకులు తెలంగాణను వ్యతిరేకించేవారిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. సీమాంధ్ర నాయకులు ఎంతచేసినా తెలంగాణ నాయకుల మధ్య ఐకమత్యం ఉంటే తెలంగాణ సాధించడం ఎంతసేపో పట్టదని మధుయాష్కి అన్నారు.

అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అంటూ కేసీఆర్ గంటకో మాట చెపుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారనీ, ఆయనతో కానీ ఆయన పార్టీతో కానీ తెలంగాణ రాదని అన్నారు.
సంబంధిత సమాచారం
Feedback Print