ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్ పార్టీలో చేరితే నన్ను వెలివేయండి: రఘువీరా పిలుపు (Raghuveera Reddy | Jagan Party | Expatriate | Congress)
జగన్ పార్టీలో చేరితే నన్ను వెలివేయండి: రఘువీరా పిలుపు
శనివారం, 11 ఆగస్టు 2012( 17:55 IST )
FILE
జగన్ పార్టీ వైకాపాలో చేరుతే తనను సమాజం నుంచి బహిష్కరించవచ్చని రాష్ట్ర రెవిన్యూమంత్రి రఘువీరా రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గోడ దూకుళ్లు కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అనీ, దూకేవారు ఇతరులు దూకుతున్నారంటూ నిందలు మోపుతుంటారని అన్నారు. తనకు పార్టీ మారాల్సిన ఖర్మ పట్టలేదన్నారు. తను పదవిలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ జెండా మోస్తూనే ఉంటానని పునరుద్ఘాటించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో ఏవయినా సమస్యలుంటే అధిగమించి ముందుకు వెళతామన్నారు. వీటి సమీక్ష కోసమే సీఎం ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.