ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » దానం నాగేందర్‌కు చర్చి - మసీదులకు తాళం వేసే గట్స్ ఉన్నాయా...?!! (Danam Nagendar | Lock | Masjid | Church | Hindu Activists)
దానం నాగేందర్‌కు చర్చి - మసీదులకు తాళం వేసే గట్స్ ఉన్నాయా...?!!
శనివారం, 11 ఆగస్టు 2012( 20:29 IST )
FILE
మంత్రి దానం నాగేందర్‌ను ఇస్కాన్ వ్యవహారం వచ్చే శ్రీకృష్ణాష్టమి వరకూ వదిలేట్లు లేదు. ఆయనపై పోలీసు కేసులు నమోదయిన సంగతి అలా ఉంచితే... ఇప్పుడు హిందూత్వ వాదులు దానం చేష్టలపై మండిపడుతున్నారు.
శ్రీకృష్ణాష్టమి పండుగకు ముందు మంత్రి దానం నాగేందర్ బంజారాహిల్స్ ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయానికి తాళం వేయడంపై హిందూత్వ వాదులు ధ్వజమెత్తుతున్నారు. భక్తులు ఆలయంలో దైవ దర్శనం చేస్తున్న సమయంలోనే మంత్రి ఆలయం గేటుకు తాళం వేశారు.. అదే రీతిలో ఏదయినా మసీదుకో, చర్చికో వేయగలరా.. అంటూ స్వామి పరిపూర్ణానంద ధ్వజమెత్తారు.
దైవ ఆలయానికి తాళం వేసిన మంత్రిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రిగారికి దేవాలయం పరిధిలో ఉన్న భూమిపై కన్ను పడిందనీ, ఆ భూమిని కబ్జా చేసేందుకు ఇలా హల్‌చల్ చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలు సైతం దానం చర్యను ఖండిస్తున్నాయి.