జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణను తేల్చేద్దామన్న బాబు... మరి సీమ తమ్ముళ్లేమంటారో...?!! (Chandrababu | Politbeuro Meet | Telangana | Rayalaseema)
FILE
రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడ్ని తెలంగాణ ప్రాంతంలో ఇబ్బందిపెడుతున్న తెరాసకు కౌంటర్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయినట్లు కనిపిస్తోంది. శనివారం సాయంత్రం జరిగన తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడే స్వయంగా తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించేద్దామని చెప్పేశారు.

దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బాబు మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నారనే వార్తలు వినబడుతున్నాయి. సమావేశంలో పాల్గొన్న టి.తెదేపా నాయకులు మంచి జోష్ మీద కనిపించారు. ఐతే సీమాంధ్రకు చెందిన నాయకులు మాత్రం కాస్త చూసి నిర్ణయాన్ని ప్రకటించండి బాబూ అని చెప్పినట్లు తెలిసింది.

ఇప్పటికే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలనీ, తెలంగాణ విభజన చేస్తే చూస్తూ చేతులు ముడుచుక కూచోమని సీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించడమే కాక దీక్ష కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమ తమ్ముళ్లు వైఖరి ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.
సంబంధిత సమాచారం
Feedback Print