జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మీడియా గోలే కానీ శిశు మరణాలే లేవు: కొండ్రు మురళి (Kodru Murali | Children | Hospitals | Media)
FILE
ప్రభుత్వ ఆస్పత్రులలో శిశు మరణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయనీ మీడియా గోలగోల చేస్తుంది తప్ప నిజానికి ప్రభుత్వాసుపత్రుల్లో చోటుచేసుకుంటున్న శిశు మరణాలు బహు స్వల్పమని సర్దిచెప్పుకున్నారు మంత్రి కొండ్రు మురళి.

ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించిన శిశువులు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉంటున్నారని కితాబిచ్చారు. బయటి ఆస్పత్రుల్లో పుట్టిన శిశువులు అనారోగ్య సమస్య ముదిరి 80 శాతం ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడికి తీసుక వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అటువంటి కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.

ఈ విషయాలను మీడియా తెలుసుకుని రాయాలని కోరారు. అంతేతప్ప చనిపోయిన ప్రతి శిశువు ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం వల్లనే అంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
సంబంధిత సమాచారం
Feedback Print