ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఉప ఎన్నికల్లో దిమ్మతిరిగే బాబు బీసీ మంత్రం: గట్టు (Chandrababu, bc Declaration, Vijayamma, Gattu)
ఉప ఎన్నికల్లో దిమ్మతిరిగే బాబు బీసీ మంత్రం: గట్టు
సోమవారం, 20 ఆగస్టు 2012( 17:27 IST )
FILE
మొన్నటి ఉప ఎన్నిక ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మతిరగడం వల్లనే ప్రజలను ఏదోవిధంగా మభ్యపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని వైకాపా నాయకుడు గట్టు రామచంద్రరావు అన్నారు. బాబు చేస్తున్న ప్రకటనలన్నీ మోసపూరితమయినవేనని ఆయన అన్నారు.
తన హయాంలో చంద్రబాబు నాయుడు బీసీలకు ఏం చేశారని విజయమ్మ రాసిన లేఖతో బాబుకు దిమ్మ తిరిగి ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. ఇదే విషయాన్ని తేదేపాలో ఉన్న బీసీలు సైతం చెపుతున్నారని ఆయన వెల్లడించారు.