ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణాను వేరు చేస్తామంటే ఒప్పుకోం : సీమాంధ్ర ఎంపీలు (Telangana | Seemandhra Mp's | Ananta Venkatrami Reddy)
తెలంగాణాను వేరు చేస్తామంటే ఒప్పుకోం : సీమాంధ్ర ఎంపీలు
మంగళవారం, 28 ఆగస్టు 2012( 11:15 IST )
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని వేరు చేస్తామని కేంద్ర నిర్ణయిస్తే సహించే ప్రసక్తే లేదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు మరోమారు తేటతెల్లం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు సమ్మతించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు.
దీనిపై అనంతపురం ఎంపీ అనంత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు. ఏలూరు ఎంపీ కావూరి ఇంట్లో జరిగిన భేటీలో సీమాంధ్ర ఎంపీలు తెలంగాణా అంశంతో పాటు పలు విషయాలపై చర్చించారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో సీమాంధ్ర ఎంపీలు అప్రమత్తమయ్యారు.