జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » 2014 వరకు నేనే సీఎంను .. నా నేతృత్వంలోనే ఎన్నికలు : కిరణ్ (Kiran Kumar Reddy | Azad | s Jaipal Reddy | Congress | cm)
kiran kumar reddy
File
FILE
వచ్చే 2014 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 2014లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను తన నాయకత్వంలోనే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం పాలమూరు జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో సీఎం పాల్గొనివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెలాఖరులో చేపట్టే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలను కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డికి అప్పగిస్తారంటూ జాతీయ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి.

ఇదేవిషయంపై ఆయన శనివారం రాత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో ఫోనులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆజాద్... రాష్ట్రంలో నాయకత్వ మార్పంటూ ఉండబోదని స్పష్టం చేసినట్టు కిరణ్ తర్వాత వెల్లడించారు. అదేసమయంలో 2014 దాకా తానే ముఖ్యమంత్రినని చెప్పారు. తన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలకు వెళుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో విజయం దిశగా పార్టీని నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం
Feedback Print