జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణ మార్చ్ వేదిక ట్యాంక్ బండ్ : కోదండరామ్ స్పష్టీకరణ (Kodandram | Telangana March | Tank Bund | Tjac | Regional)
kodandaram
File
FILE
తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈనెల 20వ తేదీన తెలంగాణ రాజకీయ ఐకాస తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు వేదిక ట్యాంక్ బండేనని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మార్పు లేదని, ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు కూడా తెలియజేశామని ఆయన ప్రకటించారు.

అయితే, తెలంగాణ మార్చ్‌కు అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం భావించినా.. కుట్రలు పన్నినా తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలే పునరావృత్తమవుతాయని, వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వంలోని కొంత మంది కుట్రలు పన్నుతున్నారని కోదండరాం ఆరోపించారు. దీన్ని సహించేది లేదని హెచ్చరించారు. శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ను అసాంఘిక శక్తులతో దెబ్బతీసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.
సంబంధిత సమాచారం
Feedback Print