హైదరాబాద్లో ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన అశ్వనీ నాయర్ అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ విఫలమే కారణంగా తెలుస్తోంది. ఈమె మంగళవారం భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. గచ్చిబౌలీలో ఉన్న ఒరాకిల్ కంపెనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది స్థానిక ఉద్యోగుల్లో కలకలం రేపింది.