గిడుగు రాజేశ్వరరావు ఇకలేరు : గుండెపోటుతో మృతి!

ap news
PNR| Last Modified సోమవారం, 22 జులై 2013 (11:43 IST)
File
FILE
ప్రముఖ కవి, రచయిత.. గిడుగు రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆయనకు 82 యేళ్లు. శనివారం సాయంత్రం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరిన ఆయన.. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ఘాట్‌లోని శ్మశానంలో ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.

వ్యవహారిక భాషోద్యమ నిర్మాత గిడుగు రామ్మూర్తి మనవడైన రాజేశ్వరరావు.. పూలతేరు, కాళిందిలో వెన్నెల, మల్లెపందిరి, గిడుగు రాజేశ్వరరావు కథలు మొదలైన కథా సంపుటాలను, భావవీచికలు, రాగవీచికలు వంటి గేయసంపుటాలను వెలువరించారు.

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, జానకి, మోహన రాజు తదితరులు ఆయన రచించిన పాటలను పాడారు. కందపద్యాలు రాయడంలో రాజేశ్వరరావు దిట్ట. పిల్లల కోసం గేయాలు, కథలు సైతం రచించారాయన. 'గిడుగురామ్మూర్తి జీవిత చరిత్ర'ను కూడా ఆయన రాశారు. రాజేశ్వరరావుకు కుమార్తె స్నేహలత, కుమారుడు రామదాసు ఉన్నారు.


దీనిపై మరింత చదవండి :