జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ లొంగుబాటు : నేనే కాల్చిచంపా!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (11:38 IST)

Widgets Magazine

erra shekar
File
FILE
సోదరుని హత్య కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం. ముఖ్యంగా సోదరుని హత్యకు తన సొంత పిస్తోలుతోనే స్వయంగా మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో సోదరుడు జగన్ మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని వెల్లడించారు.

గత జూలై నెల 17వ తేదీన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర జగన్ మోహన్ హత్య పాలమూరు జిల్లా దేవరకద్రలో జరిగింది. ఈ కేసులో సిట్టిగ్ ఎమ్మెల్యే, అన్న ఎర్ర శేఖర్ ప్రధాన నిందితుడుగా ఉన్నట్ట పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు.

హత్య జరిగిన అనంతరం ఎర్ర శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో ఎర్ర శేఖర్ రెండు రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయి, హత్యకు ఎలా కుట్ర పన్నింది వాంగ్మూలం ఇచ్చాడు.

ఈ కేసు వివరాలపై జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. దేవరకద్ర మండలం సీసీకుంట సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎర్రశేఖర్ భార్య భవాని, తమ్ముడు జగన్‌ మోహన్ భార్య అశ్రితలు పోటీ చేయాలని నిర్ణయించి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆశ్రితను పోటీ నుంచి తప్పించాలని ఎర్రశేఖర్ సోదరుడిని కోరాడు.

అందుకు అతడు రూ.రెండు లక్షలు, వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశాడు. దీనికి అంగీకరించిన ఎమ్మెల్యే.. జగన్‌ మోహన్‌తో పాటు తన అనుచరులు తిమ్మన్న, రాములు, నర్సింహులు, సూర్యనారాయణ, రాజులను నామినేషన్ ఉపసంహరణకు కారులో దేవరకద్రకు పంపాడు.

అయితే, అప్పటికే నామినేషన్ ఉపసంహరణకు గడువు మించిపోవడంతో ఎర్ర శేఖర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత సోదరునితో పాటు.. తన అనుచరులను అక్కడే ఉండమని చెప్పి మహబూబ్‌నగర్ నుంచి ఎర్ర శేఖర్ ఒక్కడే దేవరకద్రకు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్ వద్ద ఉన్న సోదరుడిపై తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. జగన్‌ మోహన్ ప్రాణాలు విడిచాడు.

అనంతరం ఎర్రశేఖర్ తన అనుచరులతో కలిసి పారిపోయాడు. కాగా, ఆదివారం ఎమ్మెల్యే అనుచరులు టి.తిమ్మన్న, దండు నర్సింహులు, టి.రాములు, బోనావత్ రమేష్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య తామే చేశామని నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఎమ్మెల్యే తుపాకీ, కారుని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

టి.లో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్‌లు-చెన్నై-విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్!

తెలంగాణలో మెదక్ జిల్లాలో ఏపీలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సెజ్‌లు ఏర్పాటవుతాయని కేంద్ర మంత్రి ...

విశ్వసనీయత : జగన్ మోహన్ రెడ్డిని జనం నమ్ముతున్నారా...?!!

విశ్వసనీయత.. నమ్మకం.. మాట తప్పని మడమ తిప్పని లాంటి మాటలను వైసిపి నాయకులు ఎప్పటి నుంచో సొంతం ...

లేటెస్ట్

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడ్డ కొండ చెరియలు..

తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చెరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు రోడ్డు అడ్డంగా పడ్డాయి. ...

లఖ్వీకి బెయిలా.. ఫైర్ అవుతున్న భారత్.. పాక్ ప్రతిష్ట దిగజారుతోంది!

ముంబై మారణహోమం నిందితుడు, లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాది రహ్మన్‌ లఖ్వీకు పాకిస్తాన్‌ కోర్టు బెయిల్‌ ...

Widgets Magazine