Widgets Magazine

టీడీపీ సీమాంధ్ర ఎంపీల దీక్ష భగ్నం : ఆస్పత్రికి తరలింపు

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:10 IST)

Widgets Magazine

tdp
File
FILE
పార్లమెంట్ ఆవరణలో టీడీపీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు చేపట్టిన దీక్షను ఢిల్లీ పోలీసులు సోమవారం అర్థరాత్రి భగ్నం చేశారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి, ముగ్గురు టీడీపీ లోక్‌సభ సభ్యులను ఇష్టం లేకున్నా ఆస్పత్రికి తరలించారు.

విభజన పేరుతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌ వేదికగా నినదిస్తున్న టీడీపీ సీమాంధ్ర ఎంపీలు.. అన్ని రకాలుగా తమ గళం వినిపిస్తున్నారు. లోక్‌సభలో సస్పెన్షన్‌కు గురైన నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, కొనకళ్ల నారాయణ సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరాహార దీక్షకు దిగిన విషయం తెల్సిందే.

సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తమకు నిరసన తెలుపుకునే అవకాశం కల్పించాలని కోరినా... స్పీకర్‌ అందుకు సమ్మతించలేదని, అందుకే దీక్షకు దిగినట్టు వారు ప్రకటించారు. వీరికి సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు, కేంద్రమంత్రులు సంఘీభావం తెలిపారు. దగ్గర కూర్చుని మద్దతు తెలిపారు.

ఢిల్లీలోని వాతావరణంలో తీవ్రంగా ఉండడంతో.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎంపీలను డాక్టర్లు హెచ్చరించారు. అయినా వీరు లెక్క చేయలేదు. తమ నిరశన కొనసాగించారు. చివరకు మార్షల్స్‌ రంగంలోకిదిగి అంబులెన్స్‌లో ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.


ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.


Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు: ముమ్మరంగా సహాయచర్యలు

తమిళనాడులోని సోమనాయినిపట్టి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ...

హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు... కాపుల విధ్వంసానికి కారణమదే!

తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన కాపుల విధ్వంసానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత, ఏపీ ...

లేటెస్ట్

హిమ శిఖరం నుంచి లోయలో పడ్డట్టయింది... స్నాప్ డీల్ తహతహలాడుతోందట...

నోరు జారితే తిరిగి తీసుకోవడం చాలా కష్టమని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటపుడు ...

కేసీఆర్ చెప్పిందే వేదం... గ్రేటర్ రిజల్ట్స్... తెదేపా, కాంగ్రెస్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా...?

తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తెరాసకు నీరాజనాలు పట్టారు. రాష్ట్రం ఏర్పడింది మొదలు వరుసబెట్టి తెరాస ...