కేటీఆర్ : సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక కిరణ్ హస్తం!

FILE
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే కె.తారకరామారావు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తాజా పరిస్థితులు కిరణ్ వల్లే ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు.

ఆయనను కలిసినంతనే ఏపీఎన్జీవోలు సమైక్యనినాదం అందుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఏపీఎన్జీవోలు కిరణ్ అదుపాజ్ఞల్లో పనిచేస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడిచేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రావాలంటే, కిరణ్‌ను దిగ్విజయ్ అదుపు చేయాలని సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక కిరణ్ రెడ్డి హస్తముందన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట మాజీ దివంగత ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే సీఎం నోరు మెదపట్లేదని కేటీఆర్ చెప్పారు.

అలాగే టీడీపీ నేత పయ్యావుల కేశవ్., తమిళులతో పెట్టుకోవడంతో రాజీవ్ గాంధీ, సిక్కులతో పెట్టుకోవడం వల్ల ఇందిరాగాంధీ పోయారని, అలాగే తెలుగువారి ఉసురు సోనియా గాంధీకి తగులుతుందని వ్యాఖానిస్తుంటే కిరణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే కేసీఆర్ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఎన్నో కేసులు పెట్టారని కేటీఆర్ గుర్తు చేశారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine

 

Widgets Magazine

ఎడిటోరియల్స్

కాంగ్రెస్ పార్టీలో ముసలం... హస్తం ఏమవుతుందో...?

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ముదురుతున్నాయి. ముఖ్యమంత్రులపై మంత్రులు ...

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అర్హమైన నగరం అదే...!

రాజధాని... రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, అభివృద్ధి కార్యకలాపాలకు గుండెకాయ. అది దేశానికైనా, ...

లేటెస్ట్

మోడీ - జైట్లీలను మెప్పించి.. ఆధార్‌కు జీవం పోసిన నీలేకని!

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ కార్డుల ...

బాల్ థాక్రే, మహాత్మా గాంధీల కంటే కేసీఆర్ బెటర్: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఐస్ క్రీమ్ తర్వాత మళ్లీ సీన్లోకి వచ్చాడు. అయితే ఈసారి ...