జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » హరికృష్ణ : ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆహార భద్రత బిల్లు తీసుకొచ్చారు!
FILE
తన తండ్రి నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆహార భద్రత బిల్లును తీసుకొచ్చారని హరికృష్ణ అన్నారు. లోక్ సభలో సోమవారం ఆమోదం పొందిన ఈ బిల్లుపై మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నానంటూ కొందరు అంటున్నారన్న ప్రశ్నకు హరికృష్ణ స్పందించి.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

కాగా తెలుగుదేశం పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ తన పదవికి రాజీనామా చేశారని టాక్ వస్తోంది.

ఈ నేపథ్యంలో.. నాన్నగారు స్థాపించిన పార్టీని చంద్రబాబు నడుపుతూ.. ఆ పార్టీలో నందమూరి వారసులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై హరికృష్ణ ఫైర్ అయ్యారు. అందుకే ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి ప్రత్యేక పార్టీని స్థాపించి జూనియర్ ఎన్టీఆర్‌ను పైకి తీసుకురావాలని హరికృష్ణ భావిస్తున్నట్లు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత సమాచారం
Feedback Print