Widgets Magazine

వైఎస్సార్ వుంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు... విజయమ్మ

మంగళవారం, 27 ఆగస్టు 2013 (15:30 IST)

Widgets Magazine

Vijayamma
FILE
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నట్లయితే రాష్ట్ర విభజన సమస్య వచ్చి ఉండేది కాదని ప్రధానమంత్రి తనతో అన్నట్లు వైఎస్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేసిన నేపధ్యంలో తలెత్తిన పరిస్థితులపై వైఎస్ విజయమ్మ మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.

అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న ప్రజల మధ్య ద్వేషాలు పెరుగుతున్నాయనీ, రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోయిందని ప్రధానితో చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేట్లు చేస్తేనే రాష్ట్ర విభజన చేయాలనీ, లేదంటే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

విజయమ్మ ప్రధానికి ఇచ్చిన లేఖలో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష గురించి కూడా పేర్కొన్నారు. కాగా ప్రజల అభ్యంతరాలన్నీ తాము త్వరలో ఏర్పాటు చేయబోయే మంత్రుల బృందం కమిటీ ముందు చెప్పవచ్చని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...