ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది చిట్ట చివరి అస్త్రమని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉందని, అక్కడ శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత అని గుర్తు చేశారు.