చంద్రయాన్-1 మిషన్ కోసం ఉపయోగించే అంతరిక్ష నౌక వేగంగా ముస్తాబవుతోందని ఇస్రో భౌతిక పరిశోధనా కేంద్ర డైరెక్టర్ ప్రొఫెసర్ గోస్వామి తెలిపారు. 2008లో ప్రయోగించే ఈ ప్రత్యేక అంతరిక్ష నౌఖలో ఫస్ట్‌పేలోడ్‌ను నింపినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భాగంగా బుధవారం ‘చంద్రునిపై ప్రయోగాల్లో భారత దృక్పథం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
చంద్రగ్రహం పుట్టుక, పూర్వపరాలు తెలుసుకునే ప్రధాన ఉద్దేశాలతో చంద్రయాన్-1ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చంద్రయాన్-1తో భారత అంతరిక్ష పరిశోధన కొత్త మలుపు తిరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2011లో జరిపే చంద్రయాన్-2 కోసం సన్నాహాలు జరుగుతున్నాయిని వెల్లడించారు. 2020 నాటికి సౌరగోళం లోపలి, బయటి రహస్యాలను ఛేదించే విధంగా తమ పరిశోధన కొనసాగుతోందని వివరించారు.
|