ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
 
ఈ వారం బ్లాగు '24 ఫ్రేములు, 64కళలు'
గతవారం 'తెలుగుదనం' బ్లాగు యొక్క విశేషతలను తెలుసుకున్నాం. ఈ వారం నెటిజన్లకు షడ్రసోపతమైన భోజనం వలె సమాచార విందును అందించే '24 ఫ్రేములు, 64కళలు' పేరిట ప్రచురితమవుతున్న బ్లాగులో ఆకట్టుకునే అంశాలను గురించి చర్చించుకుందాం.

ఈ బ్లాగులోకి అడుగుపెట్టగానే వివిధ కథనాలతో విన్నూతమైన పోకడలు పోతున్న ప్రధాన పేజీ రంగుల హరివిల్లు వలె స్వాగతం పలుకుతుంది. ఇక కేవలం ఒకే ఒక అంశానికి పరిమితం కాకుండా వేర్వేరు అంశాలను కూడా పరిచయం చేస్తున్నది. ఈ బ్లాగులోని కథనాలకు విరివిగా స్పందన లభిస్తున్నదనే దానికి సంకేతంగా అనేక కామెంట్లు కనపడుతుంటాయి.

అలాగే ఈ బ్లాగులో సంగీతం, సాహిత్యం, సినిమా విభాగాలకు రచయితలు తమ రచనలను తెలుగు లేదా ఇంగ్లీషు భాషలలో రచించి పోస్టు చేసేందుకు అనుగుణంగా రూపొందించారు. ఎప్పటికప్పుడు తాజా కథనాలతో నవీకరించబడుతూ సందర్శకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

ఈ బ్లాగును సందర్శించాలనుకునేవారు http://www.24fps.co.in అన్నలింక్‌ను టైపు చేసి క్లిక్ చేస్తే చాలు. మీకు అవసరమైన, నచ్చిన విషయాలను తిలకించవచ్చు. వచ్చేవారం మరో బ్లాగు గురించి చర్చించుకుందాం.
మరిన్ని
2011లో చంద్రయాన్-2 ప్రయోగం
భారత కుబేరుడుగా రిలయన్స్ అధినేత
'ఇండియన్ ఐడాల్-3' విజేతగా ప్రశాంత్ తమంగ్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మొయిలీ
ఈ వారం బ్లాగు 'తెలుగుదనం'
సెప్టెంబర్ 22న ఐటీఏ ఆధ్వర్యంలో చంద్రమోహన్‌కు సన్మానం