ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
 
నేడు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం
PTI PhotoPTI
భారత వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) ఆవిర్భావమై నేటి (సోమవారం)కి 75 సంవత్సరాలు. 1932 అక్టోబరు ఎనిమిదో తేదీన స్థాపితమైన ఐఎఎఫ్.. నేడు వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోంటోంది. మొత్తం ఐదు ఆపరేషనల్ కమాండింగ్ కేంద్రాలను కలిగిన ఐఎఎఫ్‌కు 1,130 కంబోట్ 1,700 నాన్ కంబోట్ ఎయిర్‌కాఫ్ట్‌లు ఉన్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాయుసేనగా భారత వైమానిక దళం పేరుగడించింది.

తనకు అవసరమైన సిబ్బందికి అధునాతన శిక్షణ ఇచ్చుకోవడంలోను, అధునాతన యంత్రసామాగ్రిని సమకూర్చుకోవడంలోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ముందంజలో ఉండటమే కాకుండా.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. 1932 అక్టోబరు ఎనిమిదో తేదీన స్థాపితమైనప్పటికీ.. భారత వైమానిక దళంలోకి తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ను 1933 ఏప్రిల్ ఒకటో తేదీన వచ్చి చేరింది. ఆరంభంలో కేవలం ఐదు మంది పైలట్స్, ఒక ఆర్‌ఏఎఫ్‌ను కలిగివున్నది.

తొలి ఐదుగురు పైలట్స్ వీరే..
ఇండియన్ ఎయిర్‌ ఫోర్సుకు తొలి ఐదుగురు పైలట్స్‌గా విధులు నిర్వహించిన ఘనత హరీష్ చంద్ర సిర్కార్, సుబ్రొతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, అజాద్ భక్షా అవాన్, అమర్జీత్ సింగ్‌లు వైమానిక చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఆ తర్వాత సుబ్రతో ముఖర్జీ తొలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి ముందు.. అంచలంచెలుగా మరింత మంది సిబ్బందిని ఐఎఎఫ్ నియమించుకుంది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  1 | 2 | 3  >> 
మరిన్ని
ఈ వారం బ్లాగు '24 ఫ్రేములు, 64కళలు'
2011లో చంద్రయాన్-2 ప్రయోగం
భారత కుబేరుడుగా రిలయన్స్ అధినేత
'ఇండియన్ ఐడాల్-3' విజేతగా ప్రశాంత్ తమంగ్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మొయిలీ
ఈ వారం బ్లాగు 'తెలుగుదనం'