ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
 
అమెరికాలో "గానగంధర్వుని"కి సత్కారం
కర్నాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను అమెరికా కాంగ్రెస్ సత్కరించింది. శాస్త్రీయ సంగీతానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఒక ప్రశంసాపూర్వక పత్రాన్ని అమెరికా కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి నిక్ ల్యాంప్సన్ టెక్సాస్‌లో మీడియాతో మాట్లాడుతూ...

బాలమురళీకృష్ణను భారతీయ సంగీతానికి చెందిన "లెజెండ్‌"గా అభివర్ణించారు. ఈ సందర్భంగా లాంగ్ ఐలాండ్ సమీపంలో శ్రీవారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా పురస్కారాన్ని అందుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల రాష్ట్ర అసెంబ్లీ బాలమురళీకృష్ణ సంగీత ప్రతిభను కొనియాడుతూ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని చదివి వినిపించారు.
మరిన్ని
నేడే ప్రపంచ తపాలా దినోత్సవం
చెన్నై తెలుగువాసుల ఐక్యతే నా లక్ష్యం: సుబ్బారెడ్డి
నేడు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం
ఈ వారం బ్లాగు '24 ఫ్రేములు, 64కళలు'
2011లో చంద్రయాన్-2 ప్రయోగం
భారత కుబేరుడుగా రిలయన్స్ అధినేత