మంచుపలకలు కరిగిపోవటం వల్ల లోపల బంధించబడి ఉన్న శక్తి పెల్లుబుకుతుందని... ఫలితంగా భవిష్యత్‌లో అత్యధిక భూకంప తీవ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ నివేదికల ప్రకారం మంచు పలకలు కరిగిపోతుండటం వల్ల భూగర్భంలో ఏర్పడే ఒత్తిడికి భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
సుమారు 10వేల ఏళ్ల క్రితం స్కాండినేవియాలో భారీ స్థాయిలో వరుస భూకంపాలు ఏర్పడినట్లు ఆ తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అదే సమయంలో ఉత్తర స్కాండినేవియాలోని మంచు పలకలు కరగడం ద్వారా ఈ వరుస భూకంపాలు తీవ్రత అధికమైనట్లు వెల్లడైంది.
అప్పట్నుంచి ఈ మంచు పలకలు కరుగుతూ వస్తున్నాయని.. దాని కారణంగా భూగర్భ కేంద్రంలో ఒత్తిడి ఏర్పడి తద్వారా పెను భూకంపాలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో వెల్లడైందంటున్నారు.
భూకంపాలు రాకుండా నిరోధించే శక్తిని మంచుపలకలు కలగి ఉన్నాయని... తాము జరిపిన అధ్యయనాల్లో తేలింటున్నారు. జర్మనీలోని బోచమ్ రుర్ యూనివర్శిటీలో భూగర్భశాస్త్ర నిపుణులు ఆండ్రియా హాంపెల్ ఈ అధ్యయన విభాగానికి నేతృత్వం వహించారు.
అత్యంత మందంగా ఉన్న ఈ మంచుపలకలు భూగర్భంలోని పెనుత్పాతాన్ని నిరోధించగలవని.. అయితే ఇవి క్రమంగా కరిగిపోతూ వస్తున్నాయని... దీంతో భూకంప తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు హాంపెల్ వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లో ఈ మంచు మరింతగా కరుగుతోందన్నారు.
|