ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"రాష్ట్ర విభజన"పై ఐటీఏ ఆన్‌లైన్ సర్వే
FileFILE
రాష్ట్రంలో తెలంగాణా వాదంపై జోరుగా చర్చసాగుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలకు ఇది అతిపెద్ద సవాల్‌గా మారింది. ఈ అంశంపై కాంగ్రెస్, తెదేపాలు ఆచితూచి అడుగులు వేస్తుండగా.. తెరాస రాష్ట్ర ఏర్పాటు కోసమే పోరాటం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజనపై వివిధ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. నిర్వహించాయి కూడా. ఇదిలావుండగా.. చెన్నై మహానగరంలో సాంస్కృతి సంస్థల్లో ప్రముఖంగా పేరొందిన "ఇండియన్ తెలుగు అసోసియేషన్" తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా సర్వేను ఇప్పటికే ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణా, రాయలసీమ, కోస్తా ఆంధ్ర రాష్ట్రాల పేరుతో మూడు ముక్కలు చేయవచ్చా? లేదా? అనే అంశంపై ఆన్‌లైన్ పోలింగ్ నిర్వహించనుంది. ఈ అంశంపై పోలింగ్‌లో పాల్గొనే వారు www.indiantelugu.com అనే వెబ్‌సైట్‌లో ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ వెబ్‌సైట్ ఓటింగ్ ఫలితాలను మే నెల ఒకటో తేదీన ప్రత్రికల మూలంగా వెల్లడిస్తారు. ఈ విషయాన్ని ఐటీఏ అధ్యక్షుడు డి.నాగేష్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని
కరుగుతున్న మంచు... పెరగనున్న భూకంప తీవ్రత
లింగ మార్పిడిదారులకు రేషన్ కార్డులు
తొలి ఉపగ్రహాన్ని ఆవిష్కరించనున్న వియత్నాం
సోనియా గాంధీ "పదేళ్ళ ప్రస్థానం"
అస్థిపంజరంతో విమానాశ్రయంలో మహిళ
ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో నలుగురు భారతీయలు