ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కూర్మమా.. మజాకానా...
వానరం సిగరెట్టు తాగడాన్ని చూసి అదో విడ్డూరమని వాపోయే వారికి... అంతకుమించిన మరో విడ్డూరం ఉందంటే నమ్ముతారా...? నమ్మక తప్పదండీ.... మీరిప్పుడు తెలుసుకోబోయే విషయం మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యానుభూతులకు లోనుచేస్తుంది.

విషయమేంటంటారా... చైనా రాజధాని బీజింగ్‌లో ఈశాన్య భూభాగంలో ఉండే జిలిన్ ప్రాంతానికి వెళ్తే ఓ వింతైన తాబేలు మనకు దర్శనమిస్తుంది. ఈకూర్మానికి ఓ అలవాటుంది... అదేంటంటే.. మనుషుల్లా ఎంచక్కా పొగతాగేస్తుంది. వినటానికే విచిత్రంగా ఉంది కదూ...

యున్ అనే వ్యక్తి తన నివాసంలో ఈ తాబేలును పెంచి పోషిస్తున్నాడు. ఈ కూర్మాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునే ఈ వ్యక్తికి సాధారణంగానే పొగత్రాగే అలవాటుంది. ఓ రోజు కోపోద్రేకంలో తన నోటిలోని సిగరెట్టును కిందకు విసిరి పారేశాడు. అక్కడే ఉన్న తాబేలు దానిని అందిపుచ్చుకని నోట్లో పెట్టేసుకుంది మరి.

అప్పటికే ఆకాశాన్నంటే కోపంలో ఉన్న యున్‌కు తాబేలు వింతైన చర్యను చూసి ఆగిపోయాడు. అతనికి నమ్మకం కుదరక వెంటనే మరో సిగరెట్టు వెలిగించుకుని దాన్ని కూర్మం నోటి దగ్గరుంచాడు. అంతే... ఆశ్చర్యపోవడం యున్ వంతైంది. ఇక అప్పటినుంచి ఎప్పుడు సిగరెట్టు వెలిగించి ఇంటికెళ్లినా సగం తను తాగి మిగిలినది కూర్మానికిచ్చేస్తాడు.

చైనాలోని ఓ పత్రికకు ఈ వార్త అందడంతో వెంటనే వారు ఆ కూర్మం పొగ త్రాగేప్పుడు క్లిక్‌మనిపించారు. విలేకరులతో యున్ మాట్లాడుతూ మనిషివలే ఈ కూర్మం సిగరెట్టుకు బాగా అలవాటు పడిందని తెలిపాడు.

అతను చెప్పడమే కాదు... పదుగురి ఎదుటి దాన్ని నిజం చేసి చూపాడు కూడా... ఎప్పుడైతే తను సిగరెట్టు తాగుతాడో... అప్పుడు మరో సిగరెట్టును వెలిగించి
తాబేలు నోటి దగ్గర ఉంచుతాడట. మరో వింతేమిటంటే.. ఈ కూర్మం ఒక సిగరెట్టును కేవలం నాలుగు నిమిషాల్లో ఉఫ్‌మనిపిస్తుందట.

ఈ విపరీత చర్యకు అందరూ టక్కున ముక్కున వేలేసుకుని... ఔరా కూర్మమా అంటున్నారు. అక్కడి స్థానిక ఉన్నతాధికారి మాట్లాడుతూ మనుషులను అనుకరిస్తూ వానరం పొగత్రాగడం చూశాం గాని... ఒక తాబేలు ఇలా పొగత్రాగడం చూస్తుంటే... అద్భుతమని అన్నారు. అంతా.... కలికాల మహిమ అంటారా... ఏమో....
మరిన్ని
రైతన్నల ఆత్మహత్యల్లో రాష్ట్రం టాప్: ఐరాస సర్వే
"రాష్ట్ర విభజన"పై ఐటీఏ ఆన్‌లైన్ సర్వే
కరుగుతున్న మంచు... పెరగనున్న భూకంప తీవ్రత
లింగ మార్పిడిదారులకు రేషన్ కార్డులు
తొలి ఉపగ్రహాన్ని ఆవిష్కరించనున్న వియత్నాం
సోనియా గాంధీ "పదేళ్ళ ప్రస్థానం"