ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మధ్యతరగతిలో పెరిగిన స్వార్థ చింతన...
భారతీయ నగర మధ్యతరగతి జీవుల్లో స్వార్థం, విలువల రాహిత్యం పెరిగిపోతున్నాయని మెగసెసీ అవార్డు గ్రహీత అరుణా రాయ్ విమర్శించారు. జీవితానికి నిజమైన అర్థం ఏమిటో గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేద ప్రజలే తనకు నేర్పించారని రాయ్ పేర్కొన్నారు.

శరవేగంగా నిచ్చెన మెట్లపైకి ఎగబాకుతున్న ఎగువ మధ్యతరగతితో పోలిస్తే రోజువారీ జీవితం కోసం పోరాడుతున్న భారతయ వెనుకబడిన వర్గ ప్రజలే సుసంపన్నమైన, సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడుపుతున్నారని తాను నమ్ముతున్నట్లుగా రాయ్ పేర్కొన్నారు.

భారత్ ఇవ్వాళ రెండు విభిన్న మార్గాల్లో పయనిస్తోందని, ఒకటి వెనుకబడిన వర్గం కాగా, మరొకటి మధ్యతరగతి అని రాయ్ అభిప్రాయపడ్డారు. వీరిలో వెనుకబడిన వర్గం, జీవితాన్ని మరింత ఉన్నతంగా, సంపద్వంతంగా, ప్రశాంతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో తనకు నే్ర్పితే, మరోవైపున మధ్యతరగతి స్వార్థపూరిత జీవితం, నిరర్థక జీవితం ఎలా ఉంటుందో తనకు బోధపర్చిందని అరుణా రాయ్ పేర్కొన్నారు.

భారతీయ వెనుకబడిన వర్గం -బ్యాక్ వర్డ్ క్లాస్- చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురవుతోందని, సామాజికంగా అదొక అసందర్భ వర్గంలా గుర్తించబడిందని రాయ్ వాపోయారు. అయితే ఈ వర్గమే తనకు జీవితంలో ఎలా పోరాడాలో నేర్పించిందని, అదేసమయంలో మధ్యతరగతి తన నగరీకరణ భావాలతో తనను నిరాశపర్చిందని రాయ్ విమర్శించారు.
మరిన్ని
కూర్మమా.. మజాకానా...
రైతన్నల ఆత్మహత్యల్లో రాష్ట్రం టాప్: ఐరాస సర్వే
"రాష్ట్ర విభజన"పై ఐటీఏ ఆన్‌లైన్ సర్వే
కరుగుతున్న మంచు... పెరగనున్న భూకంప తీవ్రత
లింగ మార్పిడిదారులకు రేషన్ కార్డులు
తొలి ఉపగ్రహాన్ని ఆవిష్కరించనున్న వియత్నాం