ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సముద్ర ఉత్పత్తుల దిగుమతుల్లో యూరప్ టాప్
భారతీయ సముద్ర ఉత్పత్తులను యూరప్ దేశాలు అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ రంగానికి సంబంధించిన ఎగుమతులను తాము ఇక ముందు కూడా కొనసాగిస్తామని భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సాధికారక కమిటీ (ఎంపీఈడీఏ) సీనియర్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే... యూరప్‌ దేశాలకు గత ఏడాది సుమారుగా 600 మిలియన్ అమెరికా డాలర్ల విలువగల సముద్ర ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. బ్రస్సెల్స్‌లో ఎంపీఈడీఏ ఛైర్మన్ జి మోహన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఇటలీ మొదలైన యూరప్ దేశాలు అత్యధికంగా భారత సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

అలాగే 2006-07 సంవత్సరంలో సుమారు 1.85 బిలియన్ అమెరికా డాలర్లు విలువ చేసే సముద్ర ఉత్పత్తుల్లో 34శాతం యూరప్ దేశాలకు ఎగుమతి చేశామన్నారు. 2012 కల్లా నాలుగు బిలియన్‌లు‌.. అలాగే 2017 కల్లా ఆరు బిలియన్‌ల అమెరికా డాలర్ల విలువ గల సముద్ర ఉత్పత్తులు పెరుగనున్నట్లు వివరించారు. అంటే సముద్రఉత్పత్తుల ఎగుమతులు మరో 54శాతం వరకు పెరుగనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, లండన్‌లో జరిగిన 16వ యురోపియన్ సీఫుడ్ ఎక్స్‌పొజిషన్ (ఈఎస్ఈ) కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మోహన్ కుమార్ పైవిధంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 80 దేశాలకు సంబంధించిన 1,600 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో భారత్ నుంచి 10 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. యూరప్ దేశాల్లోని హోటల్లలో ఎక్కువగా ఆదరణ పొందినవి సముద్రఉత్పత్తులే కావడం విశేషం. ఒక యూరప్ దేశాల్లో మాత్రమే కాకుండా.. మిగిలిన ప్రాంతాల్లోను వీటిని ఎక్కువగా ఇష్టపడుతుండటం గమనార్హం. ఫిష్‌ఫ్రై, చిల్లీ ఫిష్, ఫిష్ కర్రీల్లాంటివి అత్యంత ఆదరణ పొందిన వంటకాలు.
మరిన్ని
ధరల పెరుగుదలకు యూఎస్-ఈయూలే కారణం
1165 సీబీఐ కేసులు పెండింగ్: మంత్రి చౌహాన్
19న "గానకోకిల"కు కనకాభిషేకం
అధిక ధరలతో ఆసియాలో అలజడులు
మధ్యతరగతిలో పెరిగిన స్వార్థ చింతన...
కూర్మమా.. మజాకానా...