ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సంఖ్యా శాస్త్రంపై యూపీఏ మనుగడ  Search similar articles
PNR
FileFILE
ఊహించినట్టుగానే కేంద్రంలో 'అణు'బాంబు పేలింది. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగానే వామపక్షాలు తమ రాజకీయ పన్నాగాన్ని అమలు చేశాయి. యూపీఏకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించాలని నిర్ణయించాయి. ఇక రాష్ట్రపతిని బుధవారం కలువడమే తరువాయి. మరోవైపు ములాయం సింగ్ నేనున్నానంటూ 'అభయ హస్తం' అందిస్తున్నారు. తమ పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవన్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రకటించింది. బలపరీక్షలో నెగ్గుతామని ధీమా వ్యక్తం చేసింది.

మొత్తానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ భవితవ్యం ప్రస్తుతం సంఖ్యాబలంపై ఆధారపడింది. లో‌క్‌సభలో యూపీఏకు ప్రస్తుతం 226 మంది సభ్యుల బలం ఉంది. 59 మంది సభ్యులున్న వామపక్ష పార్టీలు బయట నుంచి మద్దతును ఇస్తున్నాయి. తాజా పరిణామాల మధ్య ఆ పార్టీ సంకీర్ణానికి మద్దతు ఉపసంహరిచుకునేందుకు తీర్మానించాయి. వీరితో కలిస్తే ప్రభుత్వానికి ఇప్పటి వరకు సాధారణంగా ఉండాల్సిన సంఖ్య కంటే అధికంగానే ఉంది.

అయితే సమాజ్‌వాది (ఎస్పీ)కి 39 మంది సభ్యుల బలం ఉంది. ఈ సంఖ్య యూపీఏతో కలిస్తే యూపీఏ-ఎస్సీ బలం 265కు చేరుతుంది. బలనిరూపణకు అవసరమైన 'మాయా సంఖ్య' (మేజిక్ నంబర్) 272 (మొత్తం సీట్లు 543). దీనికి యూపీఏ-ఎస్పీ కూటమి కేవలం ఏడు సీట్ల దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో
కాంగ్రెస్ ధీమా
  కేంద్రంలో అణు విచ్ఛిత్తి జరిగింది. యూపీఏకు లెఫ్ట్ టాటా చెప్పనుంది. నేనున్నానంటూ.. ములాయం ముందుకు వచ్చారు. మతవాద శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు మరికొందరు మిత్రులు కరచాలనానికి సై అంటున్నారు. ఈ భరోసాతో కాంగ్రెస్ ధీమాగా ఉంది.      
మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల యూపీఏకు మరికొందరు చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.


ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌, దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌‌కు మూడు, ఐఎన్‌డి, ఇతరులకు ఐదు చొప్పున సీట్లు (మొత్తం 16 సీట్లు) ఉన్నాయి. ఈ పార్టీల నేతలు ఆపన్న హస్తం అందించిన పక్షంలో యూపీఏ ప్రభుత్వం బలపరీక్ష గండం నుంచి బయటపడినట్టే. అది అసాధారణమని భావిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా జేడీఎస్‌ మాత్రం మద్దతు ప్రకటించక పోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ వామపక్షాలకు బద్ధశత్రువుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, డెమోక్రటిక్ వంటి ఒకే సభ్యుడిని కలిగిన పార్టీలు పలు వున్నాయి. ఈ పార్టీలు కూడా యూపీఏకు మద్దతు ప్రకటించే అవకాశాలు లేక పోలేదు. జేడీఎస్ మినహా మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చిన పక్షంలో యూపీఏ బలం 278కు చేరుకుంటుంది. ప్రభుత్వం ప్రమాదం నుంచి గట్టెక్కినట్టే.
మరిన్ని
వెబ్‌దునియాలో 'మెహంగాయ్'
అణు ఒప్పందం నీలినీడలు....
మహాత్మా గాంధీ అరుదైన ప్రసంగం...
విడాకుల ముహుర్తాన్ని నిర్ణయించిన వామపక్షాలు..!?  
ఒబామా బాట పడుతున్న భారతీయ అమెరికన్లు
భారత్‌ అవినీతి ర్యాంక్ 74