తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది... అంటూ ఓ తెలుగు కవి చాలా కాలం క్రితమే కవితాత్మకంగా వర్ణించారు కానీ... నేడు భక్తి అనేది ప్రపంచ వ్యాప్త వాస్తవమై కూర్చుంది. సుస్థిర జీవితం పట్ల విశ్వాసం క్రమ క్రమంగా చెదిరిపోతుండటం, జీవితంలో స్థిరపడటం అనేది చాలామందికి గగనమై పోతుండటం ప్రపంచ మంతటా పెరిగిపోతున్న నేపథ్యంలో రిక్షా కార్మికులనుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకూ భక్తి విశ్వాసాల వెల్లువలో కొట్టుకుపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే ఈ వాస్తవాన్నే మరింతగా ఢంకా భజాయించి చెప్పడం గమనార్హం.
భారత్‌లోనూ, ఇతర వర్థమాన దేశాల్లోని యువతీయువకులు భక్తిపట్ల విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారని అంతర్జాతీయ అధ్యయనం తెలిపింది. తమ తల్లితండ్రులు, తాతముత్తాతలతో పోలిస్తే ఈ తరం యువతలో భక్తి భావం పెద్దగా కనబడటం లేదన్న సాధారణ ప్రజాభిప్రాయాన్ని ఈ అధ్యయనం తోసిపుచ్చుతోంది. | | రేపటి పట్ల నమ్మకం సడలుతుండటం, వేగవంతమైన సమాజ చలనంలో రేపేమవుతుందో ఎవరికీ తెలీని పరిస్థితులు నెలకొనడం... అతీత శక్తుల పట్ల, మనిషి అనురక్తిని పెంచుతూ వస్తున్నాయి. అయితే ఇవి వెనుకబడిన దేశాల్లోనే కాక, పురోగామి దేశాల్లో కూడా పెరుగుతుండటమే విశేషం... |
| |
జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థ బెర్టల్స్‌మన్ పౌండేషన్ భారత్‌తో సహా 21 దేశాల్లోని 21.000 మంది యువతీ యువకులపై సర్వే నిర్వహించింది. సాధారణంగా ప్రజలు అభిప్రాయపడుతున్న దానికంటే ఎక్కువగానే టీనేజర్లు, యువజనులు భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నారని ఈ సర్వే కనుగొనడం గమనార్హం.
నేటి కాలపు యువత తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కంటే తక్కువ భక్తి ప్రపత్తులను కలిగి ఉన్నారన్న భావన సాధారణంగా పశ్చిమ యూరోపియన్ దేశాలకు వర్తిస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఈ సర్వే తెలిపింది.
|