ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేంద్రంలో కార్పొరేట్ 'సుడిగుండం'  Search similar articles
Yarram Reddy
నోట్ల నాయకులు
  నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే నాయకులున్నారు. నిధులు కోసం పారిశ్రామికవేత్తల గడపలు తొక్కే రథసారధులూ ఉన్న దేశం మనది. వీరు నడిపే పార్టీలు కొత్తగా నడచుకోవడం పులి గడ్డి మేయడం రెండూ ఒకటే అవుతుంది. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు.      
కేంద్రంలో అవిశ్వాసతీర్మాన సమయం దగ్గరపడుతున్న కొద్ది వాతావరణం వేడెక్కుతోంది. నాలుగేళ్ళు చట్టాపట్టాలేసుకుని ఢిల్లీ పుర వీధుల్లో విహరించిన పార్టీలు బద్ధశత్రువులుగా మారిపోయాయి. అవిశ్వాసతీర్మానాన్ని కూడా మరో సాధారణ ఎన్నికను తలపిస్తున్నాయి. రాత్రంతా రహస్య సమావేశాలు, తెల్లవారింది మొదలు.. పత్రికా ప్రకటనలు, న్యాయనిపుణులతో మంతనాలు.. ఇది మూడు రోజులుగా సాగుతున్న తంతు.

ఇది సోమవారం నుంచి మలుపు తిరిగింది. కార్పొరేట్ రంగం కేంద్రంగా చేసుకుని నడుస్తోంది. ప్రధాని మన్మోహన్‌ను రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీ కలవడమే ఈ విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. వ్యాపార సుంకాలకు సంబంధించి ముఖేశ్ అంభానీ ప్రధాన మంత్రిని కలిసినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఇదే చెపుతున్నాయి.

ప్రధానిపై సంధించడానికి వామపక్షాలకు ఓ కొత్త అస్త్రం లభించింది. ప్రధాని కార్పొరేట్ రంగాన్ని అడ్డుపెట్టుకుని అవిశ్వాసం వీగిపోయేలా చూస్తున్నారని మంగళవారం నుంచి ఆరోపిస్తున్నారు. లోక్‌సభ్యులను కొనుగోలు చేయడానికి అధికారపార్టీ కార్పోరేట్ సంస్థలను రంగంలోకి దించుతోందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖేశ్ అభానీ, ప్రధాని కలయిక ఇందుకు నిదర్శనమని దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ ప్రశ్నకు బదులేదీ?
  ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత కూడా పార్టీలకు అవసరమైన ఆర్థిక వనరులు ఎక్కడ నుంచి వస్తున్నాయి. 'కార్పొరేట్' ఆధారపడని పార్టీ ఉందా...? కార్యకర్తల చందాలతోనే నడిచే పార్టీలు ఉన్నాయా? ఎన్నికల్లో ఓటరులకు గాలం వేయనిదెవరు? దీనికి అతీతమైన పార్టీ ఏది?      
ఇప్పటికే వారూవీరూ అనకుండా అన్ని పార్టీలు లోక్‌సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. భారీ ఎత్తున డబ్బు పంపకం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అపదల్లో ఉన్న ప్రతీమారు మనదేశంలో జరుగుతున్న పని ఇదేగా. ఈ ఆరోపణల్లో భాగంగానే కార్పొరేట్ రంగం తెరపైకి వచ్చింది. దీనిపై మంగళవారం వరకు వాడీవేడిగా చర్చలు, విమర్శలు సాగుతున్నాయి.
మరిన్ని
కాంగ్రెస్‌ను కలవర పెడుతున్న 'మ్యాజిక్ ఫిగర్'  
యువతలో పొంగిపొర్లుతున్న భక్తి రసం...
రూపొందించేది రాకెట్లయినా.... ప్రయాణించేది సైకిల్ పైనే.
విడాకుల కోసం బారులు తీరుతున్న యువత  
సంఖ్యా శాస్త్రంపై యూపీఏ మనుగడ
వెబ్‌దునియాలో 'మెహంగాయ్'