పిల్లలు పుట్టగానే ఎవరయినా తల్లి పోలికలున్నాయా లేక తండ్రిపోలికలు ఉన్నాయా అని వెతుకుతారు. వీరిద్దరి పోలికలు లేకుంటే మేనమామ లేదా మేనత్త పోలికలు వచ్చాయని పరాచకాలు ఆడుతుండటమే మనకు తెలుసు. కాని ఒకే పోలికలు కలవారితో ఈ ప్రపంచం నిండిపోతే... బాగుంటుందో బాగుండదో మనం తేల్చుకోవాలి కాని అమెరికాలో ఇలాంటి పిల్లలు తమ తండ్రెవరో తెలుసుకునే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు మరి.
న్యూయార్క్‌లో ఈ మధ్యనే 25 మంది పిల్లలు ఒక చోట చేరారు. వీరిది పేగుబంధం మాత్రంకాదు. అలాగని వీరిది ఒకే వృత్తీ కాదు. వీరి సమస్య అల్లా ఏమిటంటే ఒకే పోలికలు, ఒకే రూపు రేఖలు గల తామంతా ఎక్కడినుంచి వచ్చాం.. తమ మూలమేది అనే విషయం తెలుసుకోవడమే.. జన్మదాత అయిన తమ తండ్రి ఎవరు అనేది తెలుసు కోవడమే..| అతని వీర్యానికి ఎంతో డిమాండ్... |
| | దాదాపు 8 ఏళ్ల క్రితం ఫెయిర్ ఫాక్స్ స్పెర్మ్ బ్యాంకుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతనిది ఆరోగ్యవంతమైన శరీరం.. ఇంకేమిటి బ్యాంకులోని అతని వివరాలు చూసి సంతాన యోగ్యం లేని వారు భద్రపర్చిన ఇతడి వీర్యానికి పరుగులు తీస్తున్నారు... |
| |
కృత్రిమ గర్భధారణతో పుట్టిన వీరందరికీ ఒకే తండ్రి. అతడి పేరు ఏజెంట్ 401. ఎవరూ గూఢచారి అనుకోకండి. అమెరికాలో పురషుల వీర్యాన్ని భద్రపర్చే ఫెయిర్ ఫాక్స్ కియో బ్యాంక్ ఈ తండ్రి వివరాలను ఇదే నెంబర్‌తోటే నమోదు చేసింది. తండ్రి పేరు చెప్పకున్నా అతడు జర్మనీ వ్యక్తి అని మాత్రం చెబుతోంది.
దాదాపు 8 ఏళ్ల క్రితం ఈ స్పెర్మ్ బ్యాంకుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవు, నీలి కళ్లు, డాక్టర్ వృత్తి, పైగా ఆరోగ్యవంతమైన శరీరం.. ఇంకేమిటి బ్యాంకులోని ఈ వివరాలు చూసి సంతాన యోగ్యం లేని వారు భద్రపర్చిన ఇతడి వీర్యానికి పరుగులు తీసిన కారణంగా కృత్రిమ గర్భ ధారణ ప్రక్రియలో అందరూ ఒకో పోలికలతో భూమ్మీదికి వచ్చి పడ్డారు.
పిల్లలను కృత్రిమ పద్ధతుల్లో పెంచుకోవాలని ఆరాటపడిన వారు ఇతడి వీర్యంకోసం ఎగబడటంతో ఇలాంటి ఏక పోలికలతో మరింత మంది పుట్టవచ్చని భావిస్తున్నారు. ఇంతకూ మన ఎజెంట్ 401 అనుపానులు మాత్రం దొరకలేదు.
చరిత్రలోకి చూస్తే ఇదే జర్మనీలో 70 ఏళ్ల క్రితం ఆర్యజాతి సిద్ధాంత ప్రతిపాదకుడైన హిట్లర్ ఆరోగ్యవంతమైన, బలిష్టమైన సంతానాన్ని మాత్రమే కనేందుకు ఆరోగ్యవంతులైన జంటలు మాత్రమే పెళ్లి చేసుకోవాలని సిద్ధాంతం రూపొందించాడు. హిట్లర్ ఆశయం మరొక మార్గంలో తీరుతోందనడానికి ఇదొక నిదర్శనం కాబోలు...
ఇంతకూ లోకమంతా ఒకేరకమైన పోలికలతో పిల్లలు తయారైతే ఆ వైవిధ్యరహితమైన మహా మూసను భరించేదెలా? ప్రస్తుతానికయితే ఈ ప్రశ్నకు జవాబులు లేవు.
|