ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంగారక గ్రహంలో నీటి ఆనవాళ్లు..  Search similar articles
ఒకప్పుడు అరుణ గ్రహం.. సరస్సులు, నదులు, జీవానికి దన్నుగా ఉండే నీటి అవశేషాలతో కప్పబడి ఉండేదని అంగారక గ్రహం మీది నేలలోని ఖనిజాలు చూపిస్తున్నాయని అమెరికా పరిశోధకులు తెలిపారు.

గత నెలలో అంగారక గ్రహంమీద దిగిన ఫీనిక్స్ లాండర్ ఆ గ్రహం ఉపరితలంపై మంచును కనుగొన్నివిషయం తెలిసిందే. అయితే అది శిలారూపంలో ఎర్ర ధూళితో కప్పబడిపోయింది. అయితే ఒకప్పుడు ఈ గ్రహంపై నీటి జాడ ఉండేవనడానికి ఈ ఘనరూపంలోని మంచు తిరుగు లేని సాక్ష్యంగా నిలుస్తోందని పరిశోధకుల వ్యాఖ్య.

ఈ ఆవిష్కరణ నిజంగా అధ్బుతమైనదని రోడ్ ఐలండ్‌లోని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన జాన్ మస్టర్డ్ తెలిపారు. అంగారక గ్రహంపై తాము భవిష్యత్ రోదసీ యాత్రికులు దిగడానికి అనువైన పలు స్థలాలను కనుగొంటున్నామని, ఈ గ్రహం మనుషులు జీవించడానికి అనువైనదో లేదో, గతంలో ఇక్కడ జీవం ఆనవాళ్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు భవిష్యత్తు అంగారక యాత్రలు ప్రయత్నిస్తాయని జాన్ చెప్పారు.

అంగారక గ్రహం మీది పురాతన ఉపరితలంలో దాగి ఉన్న ఖనిజాలు ఈ గ్రహం మీద అనేక తడి ప్రాంతాలను చూపిస్తున్నాయని జాన్ తెలిపారు. అంగారకుడి మట్టిలోని ఖనిజాలు తక్కువ ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఈ గ్రహంపై ఒకప్పుడు జీవించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని దీనర్థం. చాలా కాలంపాటు ఇక్కడ పుష్కలంగా నీటి వనరులు ఉండేవని దీనిబట్టి తెలుస్తోందని జాన్ వ్యాఖ్యానించారు.

ఈ కొత్త ఆవిష్కరణలతో అంగారక గ్రహంపై ఎంత కాలంపాటు నీరు ఉండేది, అక్కడ ఎన్ని తడి వాతావరణాలు ఉండేవి అనే అంశాలు పరిశోధించాల్సి ఉందని స్కాట్ ముర్చీ చెప్పారు. అరుణ గ్రహంమీది మట్టి రేణువులు ఈ గ్రహంమీది రాతిపొరల్లో 4.6 బిలియన్ల నుంచి 3.8 బిలియన్ల మధ్య కాలంలో నీటి జాడలు ఉండేవని సూచిస్తున్నాయి.

ఈ గ్రహంపై తడి వాతావరణ చాలా కాలం కొనసాగిందని ఓ అధ్యయనం చెబుతోంది. నదుల పిల్లకాలువలు అక్కడ ఓ డెల్టా రూపంలో అవతరించి ఉంటాయని దీన్ని బట్టి శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.

మొత్తంమీద జీవం ఆనవాళ్లను పొడసూపుతున్న అరుణ గ్రహం మానవ అన్వేషణలను మరిం పదును పెట్టబోతోంది.
మరిన్ని
వారి రూపు రేఖలు ఒక్కటవటానికి కారణం...?  
గ్రహాంతరవాసుల ఆగమనం కల్ల..
కేంద్రంలో కార్పొరేట్ 'సుడిగుండం'
కాంగ్రెస్‌ను కలవర పెడుతున్న 'మ్యాజిక్ ఫిగర్'  
యువతలో పొంగిపొర్లుతున్న భక్తి రసం...
రూపొందించేది రాకెట్లయినా.... ప్రయాణించేది సైకిల్ పైనే.