ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజకీయ చదరంగం : అణు వివాదం  Search similar articles
"అమెరికాతో అణు ఒప్పందం దేశ ప్రగతికి అత్యవసరం. అందుకోసం అధికార త్యాగానికి సైతం వెనుకాడబోం" అని కాంగ్రెస్ అంటోంది. "అమెరికాతో అణు ఒప్పందం భారత్‌ను విదేశాలకు తాకట్టు పెట్టడమే" అని నేడు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణమైన వామపక్ష పార్టీలు చెబుతున్నాయి.

ఇందులో నిజానిజాల మాట కాసేపు పక్కన బెడదాం. అణు ఒప్పందం అంత ప్రమాదకారి కాదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతోనే కాంగేయులు చెప్పించారు. ఇదిలా వుంటే "అణు ప్రమాదం"పై గత నాలుగేళ్లుగా లెప్ట్ పార్టీలు ఎందుకు కిమ్మనకుండా వున్నట్లు...? అది యూపీఎకు... వామపక్షాలకే తెలియాలి. అసలు ఆనాటినుంచి మద్దతూ ఉపసంహరించుకునేదాకా కేవలం బెదిరింపులతోనే ఎందుకు సరిపెట్టాయి?

మరోవైపు అణు ఒప్పందం విషయంలో దేశ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఇన్నాళ్లూ మెతక వైఖరి అవలంబించి ఇప్పుడు మాత్రం ఇంత మంకు పట్టుదలగా... అధికార త్యాగానికి సైతం ఎందుకు సిద్ధమవుతున్నట్టు... ఇవన్నీ సాధారణ ప్రజానీకం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.

అసలు అణు ఒప్పందం అనే అంశం తెరమీదకు వచ్చిందే బీజీపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన సమయంలో. అప్పటి నుంచి ఈ అణు ఒప్పందంపై అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు మేధావి వర్గంలోనూ వాడీ వేడీ చర్చలు సాగుతూనే వచ్చాయి. కానీ అవేవీ రాజకీయపార్టీల్లో ప్రస్తుతం రగులుతున్నంత వేడిని పుట్టించలేకపోయాయి.

1 | 2  >>  
మరిన్ని
తీవ్రమవుతున్న ఆహార సంక్షోభం: ఐరాస  
కేంద్రంలో రాజకీయ 'కప్పదాటు'
అంగారక గ్రహంలో నీటి ఆనవాళ్లు..
వారి రూపు రేఖలు ఒక్కటవటానికి కారణం...?  
గ్రహాంతరవాసుల ఆగమనం కల్ల..
కేంద్రంలో కార్పొరేట్ 'సుడిగుండం'