ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విశ్వాస పరీక్షలు.. గత విశ్లేషణలు  Search similar articles
PNR
FileFILE
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి పరీక్షా సమయం దగ్గరపడుతోంది. ఇది అటు పాలకుల్లోనూ, ఇటు ప్రతిపక్ష నేతల్లోనూ గుబులు పుట్టిస్తోంది. భారత్ - అమెరికా అణు ఒప్పందం సృష్టించిన ప్రకంపనలు పుణ్యమా అని యూపీఏ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సిన గత్యంతరం నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న తరుణంలో యూపీఏ విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. యాభై నెలల మిత్రబంధాన్ని వామపక్షాలు తెంచుకోవడం, కొత్త మిత్రులు ఆపన్న హస్తం అందించడంతో యూపీఏ ఈ పరీక్షకు పూనుకోవల్సివచ్చిందనే విషయాన్ని ఎవరూ మరిచిపోలేరు. ఈ నేపథ్యంలో భారత పార్లమెంట్ చరిత్రలో జరిగిన విశ్వాస పరీక్షలను ఒకసారి అవలోకిస్తే...

1969లో తొలి విశ్వాస పరీక్ష
1969లో అధికార కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది. దీంతో ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడింది. డీఎంకే, సీపీఐ వంటి పార్టీలు బయట నుంచి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయంది. కేంద్రంలో తొలి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. 1979 జూలై నెలలో జనతా పార్టీలో చీలిక ఏర్పడింది. అప్పటి విత్తమంత్రి చరణ్ సింగ్ నేతృత్వంలో 64 మంది ఎంపీలు వేరు కుంపటి పెట్టారు.

దీంతో మొరార్జీ దేశాయ్ విశ్వాస పరీక్షకు ముందుగానే పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చరణ్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ మద్దతుతో కొత్త ప్రభుత్వం
చరిత్ర చెప్పిన నిజం
  పాలక పక్షాలపై విశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టిన విపక్షాలు ఎన్నడూ విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ప్రభుత్వాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించనూ లేదు.      
ఏర్పాటైంది. అయితే.. నెల రోజులు కూడా పూర్తి కాకమునుపే చరణ్‌ సింగ్ ప్రభుత్వానికి ఇందిరాగాంధీ మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో చరణ్‌ సింగ్ లోక్‌సభలో అడుగు పెట్టకుండానే విశ్వాస పరీక్ష తేదీకి మూడు రోజుల ముందుగానే రాజీనామా చేశారు.


వీపీసింగ్ పుట్టె ముంచిన భాజపా...
1989లో భారతీయ జనతా పార్టీ, వామపక్షాల మద్దతుతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానిగా వీపి.సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఏడాది తిరగకుండానే ప్రభుత్వం కూలిపోయింది. 1990 అక్టోబరు 23వ తేదీన రథయాత్ర చేపట్టిన భాజపా అగ్రనేత అద్వానీని బీహార్‌లో అరెస్టు చేశారు. అదే రోజున వీపీ సింగ్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును భాజపా ఉపసంహరించుకుంది. నవంబరు 7న జరిగిన బలపరీక్షలో ఓడిపోయారు. దీంతో ప్రభుత్వం నుంచి ఆయన తప్పుకున్నారు.
1 | 2  >>  
మరిన్ని
రాజకీయ చదరంగం : అణు వివాదం
తీవ్రమవుతున్న ఆహార సంక్షోభం: ఐరాస  
కేంద్రంలో రాజకీయ 'కప్పదాటు'
అంగారక గ్రహంలో నీటి ఆనవాళ్లు..
వారి రూపు రేఖలు ఒక్కటవటానికి కారణం...?  
గ్రహాంతరవాసుల ఆగమనం కల్ల..