ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచపు తొలి విహంగ ప్రాణి...  Search similar articles
Birds
FileFILE
ప్రపంచంలో నేడు పక్షులు ఎన్నో రకాలు. వాటిల్లో అందమైనవి కొన్నయితే.. మరి కొన్ని అందవిహీనత ఉన్నా కుహుకుహూ రాగలను ఆలపించి మైమరపిస్తాయి. పక్షిగా పుడితే ఎల్లలు లేని ప్రపంచ ప్రయాణం చేసి ప్రకృతిలోని అందాలను స్వేచ్ఛగా.. యధేచ్ఛగా వీక్షించాలనుకోవాలని మనిషికి ఆశ పుట్టింది.

అలాగే పురాణాల్లో పుష్పకవిమానాలు వాడేవారని ప్రతీతి. కానీ వాస్తవిక ప్రపంచంలో మాత్రం అవి కనబడకపోయినా... కళ్ల ముందు కనపడుతున్న పక్షిప్రాణిని ఒక ఆధారంగా చేసుకుని దాని ఆకారంలో పోలిన విమానాన్ని సృష్టించుకుని మనిషి గగనతల విహారం గావిస్తున్నాడు. అలా ఒక ఐకాన్‌లా మనిషి గగనతల ప్రయాణం చేసేందుకు స్ఫూర్తిగా నిలచిన పక్షులు ఎప్పుడు... పుట్టాయంటే.. నిన్నటి వరకు పూర్తి సమాధానం లేని ఈ ప్రశ్నకు.. శాస్త్రవేత్తలు జవాబును కనుగొన్నారు. శాస్త్రవేత్తల నిరంతర అధ్యయనం తాలూకు సత్యాలు కొన్ని మీ ముందుంచుతున్నాం..

సుమారు 235 మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టి తొలిసారిగా గగనతల ప్రయాణం చేసిన పక్షిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలాంటి ప్రాచీన జీవశాస్త్ర అధ్యయనాలకు కేంద్రంగా భావించే ప్రముఖ సంస్థ ప్రాచీన జీవశాస్త్రానికి సంబంధించిన (పాలియెంటాలాజికల్) అసోసియేషన్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఈ పరోశధనల్లో పాల్గొన్న బృందంలో ఒకరు భారతీయ సంతతికి చెందిన వారుండటం విశేషం.

చరిత్ర ప్రారంభం కాకమనుపు 235 మిలియన్‌ల ఏళ్ల క్రితం బల్లి ఆకారం కలిగి ఉన్న పక్షులు తిరిగినట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అనంతరం వాతావరణ పరిస్థితుల అననుకూలత కారణంగా ఇలాంటి ఆకారం గల పక్షులు అంతరించాయి. అయితే 50ఏళ్ల తర్వాత అననుకూలత వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడ్డ కొన్ని మాత్రం క్రమంగా రూపాంతరం చెంది కునియోసార్‌లుగా మారాయి. ఈ జాతి పక్షినే ప్రపంచపు తొలి విహంగ ప్రాణిగా గుర్తించారు.

సుమారు 235 నుంచి 200 మిలియన్ సంవత్సరాల మధ్య అత్యంత భారీ పరిమాణంలో ఉండే వివిధ రకాల జాతులైన డైనోసార్లు వంటి జాతులు తిరిగినట్లుగా మొదటి సారి బ్రిటన్‌‌లో గుర్తించారు. నిపుణుల వివరాల ప్రకారం కునియోసార్‌లు రెండు అడుగుల ఎత్తును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీటి వెన్నెముక భాగం నుంచి రెండు వైపులా విస్తరించిన భాగాలు ఎగరేందుకు ఉపయోగపడింది. ఈ భాగాలతో కునియోసార్లు పొడవుగా ఉన్న ఎంత పెద్ద ఉపరితలాన్నైనా అవలీలగా ఎక్కేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ ఏడాది తాము నిర్వహించిన పరిశోధనల్లో కునియోసార్లలో ఆశ్చర్యకరంగా రెండు రకాల జాతులను కనుగొన్నట్లు బ్రిటన్‌కు చెందిన బ్రిస్టోల్ విశ్వవిద్యాలయ నిపుణులు వెల్లడించారు. వాటిల్లో ఒకటి కునియోసార్లు కాగా... మరొకటి కునియోసుచస్‌గా తెలిపారు. కునియోసుచస్‌లు గాలిలో స్థిరంగా ఉండగలుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఒక చెట్టు నుంచి ఎగిరేప్పుడు 9మీటర్ల మేర దాటిన తర్వాత నేల మీద వాలుతాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న జర్మనీకి చెందిన ప్రాచీన జీవశాస్త్రవేత్త కొయిన్ స్టీన్ వెల్లడించారు.
మరిన్ని
విశ్వాస పరీక్షలు.. గత విశ్లేషణలు
రాజకీయ చదరంగం : అణు వివాదం
తీవ్రమవుతున్న ఆహార సంక్షోభం: ఐరాస  
కేంద్రంలో రాజకీయ 'కప్పదాటు'
అంగారక గ్రహంలో నీటి ఆనవాళ్లు..
వారి రూపు రేఖలు ఒక్కటవటానికి కారణం...?