ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత పార్లమెంటు తలదించుకుంది  Search similar articles
Yarram Reddy
FileFILE
జవహర్ లాల్ నెహ్రూ.... మొరార్జీ దేశాయ్‌... లాల్ బహుదూర్ శాస్త్రి... ఇందిరాగాంధీ... పి.వి.నరసింహరావు... రాజీవ్‌గాంధీ.. వాజ్‌పేయి... ఇలా ఎందరో మేధావులు మాట్లాడుతున్నపుడు ఆ భవనం తలెత్తుకుని గర్వించింది. మా దేశంలోనూ ఇంతటి మేధావులున్నారని చాటి చెప్పింది. తనలో ఇంతటి మహత్తరమైన చర్చలు జరుగుతున్నాయని ఆనందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చాలా కూడా ఎదుర్కొంది.

స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడు లేనివిధంగా తన పరిధిలో మంగళవారం జరిగిన సంఘటనతో ఒక్క సంఘటనతో తలదించుకుంది. పార్లమెంటు సమావేశాన్ని లైవ్‌లో ప్రపంచ ప్రజలు వీక్షిస్తున్నారు. దురదృష్టం భారతీయ జనతా పార్టీకి చెందిన ఆశోక్ అర్గాల్ పరుగు పరుగున లోక్ సభలోకి అడుగు పెట్టారు. ఒక బ్యాగును పోడియం వద్దకు తీసుకు వచ్చారు. తెరిచి అందులోంచి నోట్ల కట్టలను డిప్యూటీ స్పీకర్‌కు చూపారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తే డబ్బులిస్తామని యూపీఏ తమకు ఎర వేశారని ఆరోపించారు.

దీంతో సభలోని సభ్యులు ఒక్కమారుగా నిర్ఘాంత పోయారు. పార్లమెంటు చరిత్రలో ఇది మొదటి సంఘటన. భారత రాజకీయాలు భ్రష్టు పట్టాయనేది నేటి మాట కాదు ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణలే. గతంలో డబ్బులు తీసుకుంటూ మీడియా వీడియోగ్రాఫర్లకు దొరికిపోయారు. కాని ఇలా ఏకంగా లంచంగా ఇవ్వజూపిన సొమ్ముంటూ చట్టసభలోకి అడుగు పెట్టడం సంచలనం కలిగించవచ్చు. లంచమం సొమ్మయినా... డ్రామా సొమ్మయినా ఇదిదిగ్భ్రాంతికర సంఘటన అది నిజమో కాదో అంతకంటే తెలియదు.

కానీ, దేశ పార్లమెంటు వ్యవస్థపై చెరిపినా చెరగని ముద్ర పడింది. ప్రపంచ దేశాల ఎదుట ముద్దాయిగా నిలచింది. లంచం ఇచ్చారా..? లేదా..? అనే అంశం విచారణలో తేలాల్సి ఉంది. కానీ ప్రపంచ మార్కెట్లో భారతదేశ పరువు తీసేశారు. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. ఇది పతనమైన రాజకీయ విలువలకు కూడా పరాకాష్ఠగా మిగులుతోంది.
1 | 2  >>  
మరిన్ని
ప్రపంచపు తొలి విహంగ ప్రాణి...
విశ్వాస పరీక్షలు.. గత విశ్లేషణలు
రాజకీయ చదరంగం : అణు వివాదం
తీవ్రమవుతున్న ఆహార సంక్షోభం: ఐరాస  
కేంద్రంలో రాజకీయ 'కప్పదాటు'
అంగారక గ్రహంలో నీటి ఆనవాళ్లు..