పుట్టిన రోజు వేడుకలను ఓ మహోత్సవంలా చాలామంది జరుపుకుంటుంటారు. అయితే కొందరి జన్మదిన వేడుకలకు ఓ ప్రత్యేకత వుంటుంది. ఇటువంటి కోవలోకి వస్తుంది ఇంగ్లండు వాసి లూయిస్ బ్రౌన్. ఆమె పుట్టినరోజుకు ఏమిటంత ప్రత్యేకత అంటే... ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ కావటమే. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో నివాసముంటున్న లూయిస్ బ్రౌన్ 1978 జులై 25వ తేదీన ఇంగ్లండులో టెస్ట్ ట్యూబ్‌లో జన్మించింది. అందుకే లూయిస్ బర్త్ డే ప్రపంచానికి ఓ స్పెషల్ డే. ఎంతోమంది టెస్ట్ ట్యూబ్ బేబీలకు తన పుట్టుక మార్గదర్శకంగా నిలవడంపై బ్రౌన్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఏటా తన పుట్టినరోజున తన స్నేహితల మధ్య ఆనందంగా జరుపుకుంటానంటోంది.
|