ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > ఉగ్రవాద దాడులకు ఆలవాలంగా హైదరాబాద్...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉగ్రవాద దాడులకు ఆలవాలంగా హైదరాబాద్... Search similar articles
Ramesh
FILE
ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ ఆలవాలంగా మారుతోంది. ఇటీవల బెంగుళూరు, అహ్మదాబాద్‌లలో జరిపిన బాంబు పేలుళ్ల తరహాలోనే హైదరాబాద్‌లోను పేలుళ్ల పరంపరను కొనసాగిస్తామని ఉగ్రవాదులు తాము పంపిన ఇ-మెయిల్‌లో హెచ్చరికలు చేశారు. సుమారు 14 పేజీలున్న ఈ ఇ-మెయిల్ అలర్బీ గుజరాత్ యాహూడాట్‌కామ్ నుంచి ఓ న్యూస్ ఛానెల్‌కు పంపబడింది. అందులో రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్‌ పేరును వారు ప్రస్తావించినట్లు తెలిసింది.

ఈ ఇ-మెయిల్ చదవిన నగర సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ పోలీసుల కదలికలను తాము నిశితంగా గమనిస్తున్నట్లు ఉగ్రవాదులు పేర్కొన్నారని తెలిపారు. ఆంధ్ర పోలీసులు... నిషేధించబడ్డ సిమీ( స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) సంస్థల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనే నెపంతో ముస్లిం యువకులను హింసించడం మానెయ్యాలని ఇండియన్ ముజాహిదీన్‌లో అనేక మంది సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు ఇ-మెయిల్‌లో చెప్పబడి ఉందని ఆ అధికారి వ్యాఖ్యానించారు.

ఒకవేళ ముస్లింలపై ఇలాంటి చర్యలను మానుకోకపోతే తర్వాత లక్ష్యం మీదేనంటూ తీవ్రంగా హెచ్చరించారని నగర పోలీసు కమిషనర్ బి.ప్రసాద రావు వివరించారు. ఈ విషయాన్ని కూడా 14 పేజీల ఇ-మెయిల్‌లో సూచించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా వుండగా నగర పోలీసు విభాగం ఓ ప్రత్యేక జట్టును అహ్మదాబాద్‌కు పంపింది. అక్కడ పేలుళ్ల ఘటనలను క్షుణ్ణంగా పరిశోధించి, ఉగ్రవాదులకు సంబంధించి వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ ప్రత్యేక జట్టును ఆక్టోపస్ విభాగం, హైదరాబాద్ పోలీసుశాఖలను మేళవించి రూపొందించారు.
తదుపరి గురి మీ పైనే...
  స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సంస్థలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనే నెపంతో ముస్లిం యువకులను హింసించడం ఆంధ్ర పోలీసులు మానెయ్యాలని లేదంటే తదుపరి గురి మీపైనేనని ఉగ్రవాదులు పేర్కొన్నారు.      


ఈ జట్టు ఇప్పటికే బెంగుళూరు చేరింది. ఇక ప్రస్తుత అంశాలను పరిశీలిస్తే... దేశంలో ఉగ్రవాదుల నెట్‌వెర్క్ ఏ మేరకు విస్తరించి ఉందో ప్రస్తుత వరుస పేలుళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా సున్నితమైన ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను నగర పోలీసుశాఖ చేస్తోంది.

సుప్రసిద్ధ దేవాలయాలు వంటి ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను రంగంలోకి దించారు. నగరంలో పోలీసు శాఖ వివిధ జట్లుగా ఏర్పడి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం, ప్రత్యేకించి సైకిళ్లు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో
ఆధ్యాత్మిక ప్రదేశాలు, రైల్వే, బస్ స్టేషన్లు, హాస్పిటళ్లను లక్ష్యాంగా చేసుకున్నట్లు స్పష్టమయ్యింది. హైదరాబాద్‌లోను అలాంటి దాడులకు తావివ్వకుండా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, మరియు గాంధీ ఆసుపత్రుల్లో ఇప్పటికే నిఘాను పెంచారు.
మరిన్ని
ధూమపాన వ్యతిరేక ప్రపంచం.. గేట్స్ స్వప్నం  
వేలానికి 'సద్ధాం హుస్సేన్' కారు  
మొదటి టెస్ట్ ట్యూబీ 30వ జన్మదిన వేడుకలు  
క్రమశిక్షణకు మారుపేరు సోమనాథ్  
ఈ లోకంలో లేకపోవడం వల్లే ఇవ్వలేదు
భారత పార్లమెంటు తలదించుకుంది