ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > భారత్‌పై రష్యా కుర్రాడి మమకారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్‌పై రష్యా కుర్రాడి మమకారం
అతనిది ఈ ఊరుకాదు... ఈ వాడ కాదు... ఆ మాటకొస్తే ఈ దేశమే కాదు... మన గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచే మమకారాన్ని పెంచుకున్నారు. ఎంత చెప్పినా దేశాన్ని వీడనంటాడు. ఈ పరిస్థితి ఒకటి కాదు.. రెండుకాదు 10 నెలలుగా కొనసాగుతోంది. భారతదేశంపై మమకారం పెంచుకున్న ఆ యువకుడిని దేశం నుంచి పంపించేందుకు గోవా ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. రష్యాకు చెందిన 24 యేళ్ళ యువకుడు ఎప్పుడో ఇండియాకు వచ్చాడు.

అంతో ఇంతో హిందీ నేర్చుకున్నడు. ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. మెల్లగా గోవాకు చేరుకున్నాడు. అతని వీసా గడువు ముగిపోవడంతో ఎక్కడున్నడాని కనుగొన్నపోలీసులు అతనిని తిరిగి స్వదేశమై రష్యాకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసు పట్టుకున్నప్పటి నుంచి మేరా భారత్ మహాన్ అంటూ నినాదులు చేస్తున్నాడు. తిరిగి రష్యాకు పంపించేందుకు నిరాకరిస్తున్నాడు ఇతని పరిస్థితిని గమనించిన పోలీసులు విస్తుపోయారు.

అతను మానసిక రోగిగా మానసిక రోగులు గుర్తించారు. నిద్రలేమి వలన గాని ఈ బబ్బు కలుగుతుందని భావించారు. అతని వింత ప్రవర్తనకు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇతనిని ఒంటరిగా రష్య పంపడానికి వారికి మనసు అంగీకరించలేదు. రష్యా రాయబారా కార్యాలయాన్ని సంప్రదించారు. అతని పరిస్థితి వివరించి బంధువులను పిలిపించాలని కోరారు.

తాము తగిన నిర్ణయం తీసుకుంటామని రష్యా రాయాబార కార్యాలయం గోవా ప్రభుత్వానికి తెలిపింది. రష్యా కూడా అతనిపై ఎటువంటి నేరారోపణ చేయలేదు. అతనిని రష్యాకు తీసుకుపోయేందుకు ఇక వారి బంధువులు రావాల్సి ఉంది. ఈ సంఘటన ఎలా జరిగినా పరాయి దేశంలో పుట్టి భారత్‌ను మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేయడం అభినందనీయం. ఆయన స్థితి ఏదైనా భారత్ అతనిని ఆకట్టుకుంది.
మరిన్ని
హిరోషిమా ఘోర కలికి 63 యేళ్లు
చట్టాలను మార్చలేం : గర్భస్రావానికి అనుమతించం
అత్యంత సంపన్న ప్రాంతంగా లండన్  
అమ్టే జంటకు మెగాసెసే అవార్డు
ఉగ్రవాద దాడులకు ఆలవాలంగా హైదరాబాద్...
ధూమపాన వ్యతిరేక ప్రపంచం.. గేట్స్ స్వప్నం