ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > మొండి... జగమొండి ముష్... ర్రఫ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మొండి... జగమొండి ముష్... ర్రఫ్
ఇదే ఆయనకు రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. కార్గిల్ యుద్ధ పరాజయంతో అప్పటి ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు, ఆయనకు మధ్య విభేదాలు పొడచూపాయి. అంతే సైనికాధ్యక్షుడుగా ఉన్న ముషార్రఫ్ కన్నెర్ర చేశాడు. నేరుగా అధ్యక్ష పదవిపై కన్నువేసి చాలా సులువుగా సైనిక చర్యతో 1999లో ఆ పదవిని కైవసం చేసుకున్నారు.

అడ్డుతగులుతారనుకున్న రాజకీయ నాయకులను దేశంలోకి అనుమతించారు. అయితే అంతర్జాతీయ సమాజం అప్పటి నుంచే ఆయన తీరు తప్పుబడుతూనే ఉంది. సైనికాధ్యక్షుడుగా భారత్‌పై కాలు దువ్వే ఆయన ఆపై సంయమనం పాటించారు. అయితే అమెరికా ఒత్తిడి మేరకు తాలిబన్లకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయన వారి హిట్ లిస్ట్‌లో చేరిపోయారు.

తరువాత 2004లో మళ్ళీ దేశ విదేశాలలో పాక్‌లో ప్రజాస్వామ్యం పాలన రావాలంటూ నిరసనలు మొదలయ్యాయి. అంతవరకూ ఇటు అధ్యక్ష పదవీ, అటు సైనికాధిపతి పదవులను అట్టిపెట్టుకున్నారు.అయితే తరువాత ఆయన కాస్త తెలివిగా ప్రత్యేకాధికారాలను దేశాధ్యక్ష పదవికి ఆపాదించుకుంటూ సైనికాధికారి పదవిని త్యజించి పూర్తిగా దేశాధ్యక్షుడి అవతారమెత్తారు.

2007లో తన అధికారానికి న్యాయ చికాకులు మొదలయ్యాయి. అసలే మొండిఘటంగా పేరు ముష్... ఇంకాస్త ర్రఫ్.. గా నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినే బలవంతంగా ఇంటికి సాగనంపారు. న్యాయవ్యవస్థ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నారు. తరువాత దేశీయంగా, అంతర్జాతీయంగా ఎదురవుతున్న విమర్శలను తట్టుకోలేక తాజాగా ఎన్నికలకు పిలుపునిచ్చారు.

తన వెంట కూడా ఓ పార్టీని పెట్టుకున్నారు. అయితే తాజా ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షురాలు బేనజీర్ భుట్టోను తీవ్రావాదులు హత్య చేశారు. తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ మెజారీటీ ఉన్న పెద్ద పార్టీగా నిలిచింది. ఇతర పార్టీలతో కలిసి పీపీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ముషార్రఫ్‌ను సాగనంపేందుకు అన్ని పార్టీలు కలిసి పథకం రూపొందించి అభిశంసనకు సిద్ధమయ్యాయి.

దీంతో విధిలేని పరిస్థితులలో ముషార్రఫ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్‌ను నాలుగోమారు సైనిక పాలనలోకి తీసుకెళ్ళి ముషార్రఫ్ చాలా మొండిఘటం. ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు సాహసోపేతమైనవే. చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా కనిపించే ముష్.... అప్పటి నుంచి ర్రఫ్‌ఫే....
<< 1 | 2 
మరిన్ని
ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వాసుపత్రులు
భారత్‌పై రష్యా కుర్రాడి మమకారం
హిరోషిమా ఘోర కలికి 63 యేళ్లు
చట్టాలను మార్చలేం : గర్భస్రావానికి అనుమతించం
అత్యంత సంపన్న ప్రాంతంగా లండన్  
అమ్టే జంటకు మెగాసెసే అవార్డు