ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > ముగిసిన సైనిక పాలన: ముషార్రఫ్ నీ దారెటు....?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముగిసిన సైనిక పాలన: ముషార్రఫ్ నీ దారెటు....?
YR Putha
అక్కడంతే...!
  పాకిస్థాన్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పరస్పర సాధింపులు, కక్షలు, వేధింపులు ఇక్కడ షరామామూలే... ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేత దేశ విడవాల్సిందే.      
ఇప్పటికి పాకిస్థాన్ నాలుగుమార్లు సైనిక పాలనలోకి వెళ్ళిందంటే అక్కడి పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటిదాకా పాకిస్థాన్‌ను తిరుగులేకుండా ఏలిన ముషార్రఫ్ వంతు రానే వచ్చింది. అధికార పీఠం నుంచి దిగిపోయారు. ఇక ఆయన పయనమెటో?

పాకిస్థాన్‌ దేశం ఆవిర్భావం నాటి నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎప్పుడు రాజకీయ అనిశ్చిత్తి రాజ్యమేలుతూంటుంది. పేరు ప్రజాస్వామ్య దేశమే అయినా ఇప్పటికి దాదాపుగా 34 యేళ్ళు సైనికపాలనలో మగ్గింది. పాకిస్థాన్ ప్రజాస్వామ్యదేశంగా మారి ఇప్పటికి 63 యేళ్ళయ్యింది. ఇందులో ఇప్పటికి నలుగురు సైనికాధ్యక్షులు పాలన సాగించారు.

వారిలో జనరల్ అయూబ్‌ఖాన్, జనరల్ యాహ్యాఖాన్, జనరల్ జియా ఉల్ హక్, జనరల్ ముషార్రఫ్‌లు పాకిస్తాన్‌ను సైనికపాలనలోకి తీసుకుపోయారు. 1947 నుంచి 1958 వరకు ప్రజాస్వామ్య పాలన సాగింది. 1958 అక్టోబరు 7 తొలిసారిగా జనరల్ అయూబ్ ఖాన్ సైనికపాలనకు శ్రీకారం చుట్టారు. అదే నెల 28న ఆయన తనను తాను అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ఈ సంప్రాదాయం కొనసాగుతూనే ఉంది.

అయూబ్‌ఖాన్ దాదాపుగా 11 యేళ్ళుపాటు 1969 వరకు తన పాలన సాగించారు. అప్పట్లో కొందరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరువాత జనరల్ యాహ్యాఖాన్ ఆ పీఠాన్ని అధిరోహించారు. అయితే 1971 నాటి యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన తరువాత బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. దీంతో అధికార పీఠం నుంచి దిపోవాలని నాయకులు పట్టుబట్టారు. దీంతో ఆయన పాలనకు ముగింపు వచ్చింది. ఆయన విధిలేని పరిస్థితులలో తన పదవిని వీడక తప్పలేదు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
మరిన్ని
మొండి... జగమొండి ముష్... ర్రఫ్
ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వాసుపత్రులు
భారత్‌పై రష్యా కుర్రాడి మమకారం
హిరోషిమా ఘోర కలికి 63 యేళ్లు
చట్టాలను మార్చలేం : గర్భస్రావానికి అనుమతించం
అత్యంత సంపన్న ప్రాంతంగా లండన్