| | ఇన్నాళ్ళు తిరుగులేని నేతగా, సైనికాధ్యక్షుడుగా పేరు పడ్డ ముషార్రఫ్ దేశీయంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. అయితే అమెరికాతో సహా చాలా దేశాలు ఆయన పట్ల సానుభూతినే ప్రకటిస్తున్నాయి. దేశం విడిచే పరిస్థితులలో తమ దేశానికి రావాలని ఆహ్వనిస్తున్నాయి. |
| |
1971 డిసెంబరు 20న జుల్ఫకీర్ ఆలీ భట్టో అధీకారంలోకి వచ్చారు. ఈయన సోషలిస్టు విధానాలతో జనానికి చాలా దగ్గరయ్యారు. 1977లో దాదాపు తిరిగి అధికారంలోకి వచ్చింది. 1973 ఆగస్టు 14న పాకిస్థాన్ తిరిగి సైనిక పాలనలోకి వెళ్ళింది. అప్పటి జనరల్ మహమ్మద్ జియా ఉల్ హక్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆయన దాదాపు 1978 వరకు పాలన సాగించారు. 1978లో హక్ సెప్టంబర్ 16న అధ్యక్ష పదవిని చేపట్టారు.
ఇదిలా ఉండగా 1978లో వివిధ ఆరోపణలపై భుట్టోకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆయన పెట్టుకున్న వినతిని హక్ తిరస్కరించారు. 1979 ఏప్రిల్ 29న భుట్టోను ఉరితీశారు. దీనిపై అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. రాజకీయ దురుద్ధేశ్యంతోనే ఆయన ఉరి తీశారనే ఆరోపణలున్నాయి. 1988 వరకూ హక్ అధికారంలో ఉన్నారు. 1988 ఆగస్టు 17న బహ్వాల్‌పూర్ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో హక్ మృతి చెందారు.
తరువాత గులాం ఇషాక్ ఖాన్ 1993 వరకూ అధికారంలో ఉన్నారు. 1993లో జరిగిన ఎన్నికల్లో పీపీపీ సహకారంతో ఫారక్ లెఘారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. బేనజీర్ భుట్టో అధికారంలోనికి వచ్చారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. అయితే లెఘారీ తనకున్న విశేష అధికారాలను వినియోంగించి భుట్టో ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
తిరిగి ఆయన 1997 వరకు పాలన సాగించారు. ఈ సమయంలో కూడా నవాజ షరీఫ్, బేనజీర్ భుట్టోల మధ్య రాజకీయ కక్ష సాధింపులు చోటు చేసుకున్నాయి. వీటన్నంటిని ఓ కంట కనిపెడుతూ వచ్చిన జనరల్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ సరిగ్గా 1999లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అన్ని పార్టీల నాయకులను పాకిస్థాన్‌లోకి అడుగు పెట్టనివ్వలేదు.
ఇక అక్కడ నుంచి 2008 ఆగస్టు 18 వరకూ ఆయన పాలన నిరాటంకంగా సాగింది. గత ఎన్నికల్లో ఏర్పడిన పార్లమెంటు ఆయనకు ముకుతాడు వేయాలని నిర్ణయించింది. ఇందుకు అభిశంసనే మార్గంగా ఎన్నుకుంది. దీంతో మొండిఘటం ముషార్రఫ్ పాలనకు తెరపడింది. అయితే ఆయన నాయకులపై సాగించిన కక్షాపూరిత ధోరణి ఆయనపై ఉండదనుకోవడం పొరపాటు.
ఇప్పటికే సంకీర్ణ నాయకులు ఛార్జీషీటు దాఖలు చేశారు. కక్ష సాధింపు చర్యల్లో పాకిస్థాన్ నాయకులు సిద్ధహస్తులు. ముషార్రఫ్ ఇది తెలియనంతటి అమాయకుడేమి కాదు. ఆయన ఇప్పిటికే ప్రవాసంలోకి వెళ్ళి పోయేందుకు సిద్ధమయ్యారు. ఆయన సౌది ఆరేబియాకు పయనవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ఆయన తన భద్రతకు సురక్షిత ప్రాంతాన్ని ఎన్నుకునే ఉంటారనే పరిశీలకులు భావిస్తున్నారు. ఆయనకు అమెరికా కూడా స్వాగతం పలుకుతోంది. ముష్... ఇంతకూ నీ దారెటూ....? |