లోకకళ్యాణార్థం భువికి యేతెంచి తన ప్రాణాలను అర్పించిన ఏసుక్రీస్తు... ప్రపంచం నలుమూలల దయామయుడిగా.. కీర్తింపబడుచున్నాడు. అయితే ఆయన ఆ దేవుని కుమారుడు. మరి క్రీస్తు చూపిన బాటనే తన మార్గంగా ఎంచుకుని ఎన్ని అవాంతరాలొచ్చినా వెనుదిరగక.. పాషాణ హృదయుల చేత కూడ కరుణామూర్తి.. ప్రేమను పంచే పవిత్రమూర్తి... శాంతమూర్తి అని పిలిపించుకున్న మనుషుల్లోని దేవతా మాతృమూర్తి మదర్ థెరీసా. మనిషై ఉండి నిస్వార్థ సేవకే అంకితమైన మానవతామూర్తి.
ఎక్కడో ఓట్టోమానా సామ్రాజ్యం (మాసిడోనియా)లో అల్బేనియా సంతతికి చెందిన మదర్ 1910 ఆగస్టు 26న జన్మించారు. నికోలా మరియు డ్రేన్ బొజాక్షువు దంపతులకు పుట్టిన మదర్ పూర్తి పేరు ఆగ్నస్ గోన్షా బోజాక్షువు. దాదాపు ఆమె తన జీవితమంతా పేద రోగులకు సేవ చేయడంలోనే గడిపింది. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు మదర్‌ను వరించాయి. | | నేను స్వప్నంలో స్వర్గ ద్వారం వద్ద నిలబడి ఉన్నాను.. అక్కడ నాకెదురుగా నిలబడి ఉన్న సెయింట్ పీటర్ నాతో అన్నారు.. ఇక్కడ నీ కోసం గుడిసెలు లేవు. నువ్వు భూమి మీదకే వెళ్లమని" చెప్పారన్నారు. |
| |
వాటిల్లో ఒకటి 1979లో నోబెల్ శాంతి పురస్కారం అయితే... మరొకటి 1980లో భారత రత్న అవార్డులు. అవి.. ఫలితం ఆశించని మదర్ సేవలకు లభించిన గౌరవసత్కారాలు. నేను ఆల్బేనియన్‌ను.. అయితే భారతీయ పౌరురాలిని... అని ఎప్పుడూ నవ్వులు చిందిస్తూ అంటుంటారు మదర్.
ఆమె జీవితంలో కొన్ని ఘట్టాలను పరిశీలిస్తే... 12 సంవత్సరాల వయసులోనే మిషనరీస్‌లో చేరాలని సంకల్పించిన మదర్ 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి డబ్లిన్‌లోని సిస్టర్స్ ఆఫ్ లోరెటొలో మిషనరీగా చేరారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అతి కొద్ది కాలంలోనే ఆమె భారత్ చేరుకున్నారు.
కోల్‌కతాలోని సెయింట్ మేరీ హైస్కూల్‌లో 1929-1948ల మధ్య ఉపాధ్యాయినిగా బాధ్యతలు నిర్వర్తించారు. కోల్‌కతా మురికి వాడల్లో పేద ప్రజల బ్రతుకు జీవనం చూసి చలించిపోయి 1946లో స్కూలును వదలి పేదలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నుంచి అంగీకారం పొందారు.
ఎలాంటి నిధులు లేకుండా తొలిసారిగా భారత్‌లో అనాథ పిల్లలకు ఓపెన్ ఎయిర్ స్కూల్‌ను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆమె సేవానిరతిని గుర్తించిన వాలంటీర్లు మదర్‌కు సాయంగా ఆ స్కూల్‌లో చేరారు. అప్పుడే ఆర్ధికపరమైన సాయం కూడా ఆమెకు అందడం మొదలయ్యింది.
|