ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > ప్రపంచానికి అమ్మ... మదర్ థెరీసా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచానికి అమ్మ... మదర్ థెరీసా
దీంతో మదర్ మరికాస్త ముందుకెళ్లి అక్టోబర్ 7, 1950లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే సంస్థను స్థాపించారు. అనాథలకు ప్రేమ... కరుణ.. వాత్సల్యాన్ని పంచడమే లక్ష్యంగా ప్రారంభమైన మిషనరీష్ ఆఫ్ ఛారిటీ ఇంతింతై వటుడింతై అన్నట్లు దేశదేశాలకు పాకింది. వృద్ధులకోసం... కుష్టువ్యాధిగ్రస్తుల కోసం, పేద రోగులకు వైద్య సాయం వంటి ఎన్నో ఎన్నెన్నో పథకాలను ఆమె ఆవిష్కరించారు.

ఈ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఇటలీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తదితర దేశాల్లో అమలు అవుతున్నాయి. ఆ సమయంలో 1971లో 23వ పోప్ జాన్ శాంతి అవార్డు.. అనంతరం అంతర్జాతీయ శాంతి స్థాపనకై కృషి చేసినందుకు 1972లో నెహ్రూ పురస్కారం, 1979లో బాల్జాన్ అవార్డులు మదర్‌కు వచ్చాయి.

మిషనరీష్‌లో 18ఏళ్ల వయసులోనే ఇళ్లు వదిలి వచ్చేసిన మదర్... ఇన్ని అవార్డులు సాధించిన తర్వాతే కాదు... తన ఆఖరి క్షణాల్లోను కుటుంబసభ్యులను కలుసుకోలేదు. 1931 మే 24న పూర్తిగా సన్యాసి జీవితాన్ని అవలంభించిన మదర్, మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించి దాన్ని 87 దేశాలకు విస్తరించారంటే... ప్రతి మనిషికి ప్రేమను పంచాలి... సేవకన్నా జీవితానికి మరో అర్థం లేదు అనే సంకల్పం ఆమెలో ఎంతగా జీర్ణించుకుపోయిందో మనకు అర్ధమవుతుంది.

ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 87 దేశాల్లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ తరపున అనేక వేల మంది సేవలందిస్తున్నారంటే.. మదర్ మాటలు.. ఆమె చూపిన బాట ఎంతమందిని ప్రభావితం చేశాయో అవగతమవుతుంది. కొందరు మహానుభావులు ఆమె గురించి పలికిన పలుకులు వారి మాటల్లోనే... "ఆమె గురించి చదువుతున్నప్పుడు... తెలుసుకుంటున్నప్పుడు.. మా హృదయాలు ద్రవిస్తాయి. సేవకే తన జీవితం అంకితం చేసిన మదర్‌లాంటి వ్యక్తిని ఇక ముందు చూడలేమేమో అనిపిస్తుంది" అని ఆమెను ప్రశంసించడం విశేషం.

1983లో తొలిసారిగా గుండెపోటుకు గురైన మదర్ 1989లో శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో చివరికి 1997లో సెప్టెంబర్ 5న తనువు చాలించారు. మదర్ తరచూ అనే మాటల్లో.. దేవుడు ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని అలాగే నన్ను కూడా పంపించాడు. ఆయనకు పేదలంటే జాలి.. ప్రేమ ఉన్నాయి అని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు.

అమ్మకు తన బిడ్డలంటే ఎనలేని ప్రేమ. కడుపు తెంచుకుని పుట్టకపోయినా... మదర్‌కు మాత్రం ప్రపంచం యావత్తు బిడ్డలతో సమానం. ముఖ్యంగా పేదవారంటే ఎనలేని ప్రేమ. ఎక్కవ తక్కువలు లేకుండా అందరినీ సమానంగా దృష్టితో చూడటం ఆమె వ్యక్తిత్వానికి దర్పణం వంటిది. నేడు దేశదేశాల్లో మదర్ థెరిసా జన్మదిన వేడుకలను.. అంటే... సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించనున్నారు.

ఇక.. మరణానికి ముందు కొద్ది కాలం క్రితం ఆమె ఓ సారి ఇలా అన్నారు... "నేను స్వప్నంలో స్వర్గ ద్వారం వద్ద నిలబడి ఉన్నాను.. అక్కడ నాకెదురుగా నిలబడి ఉన్న సెయింట్ పీటర్ నాతో అన్నారు.. ఇక్కడ నీ కోసం గుడిసెలు లేవు. నువ్వు భూమి మీదకే వెళ్లమని" చెప్పారన్నారు.
<< 1 | 2 
మరిన్ని
ముగిసిన సైనిక పాలన: ముషార్రఫ్ నీ దారెటు....?  
మొండి... జగమొండి ముష్... ర్రఫ్
ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వాసుపత్రులు
భారత్‌పై రష్యా కుర్రాడి మమకారం
హిరోషిమా ఘోర కలికి 63 యేళ్లు
చట్టాలను మార్చలేం : గర్భస్రావానికి అనుమతించం