పత్తి నుంచి నూలు పోగులను వడికే పరిశ్రమలను వాటినే చూశాం. ఆరటి నుంచి వస్రాలను తయారు చేయడం అంటే నమ్మశక్యం కావడం లేదు కదూ... ఇది సహజంగా అందరికి వచ్చే అనుమానమే. సందేహం రావడంలో తప్పు లేదు. కాని అరటిలో వస్త్రం తయారీకి అనుకూలమైన పదార్థాల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఎన్ఆర్‌సీబీ) స్పష్టంగా చెపుతోంది.
ఇదే సాధ్యమైతే వ్యవసాయరంగంలో ఇదో పెద్ద విజయంగా మిగిలిపోతుంది. వాణిజ్య రంగానికి కొత్త ఆధారం దొరికినట్లే అవుతుంది. కేంద్ర కాటన్ టెక్నాలజీ సంస్థతే కలిసి ఎన్ఆర్‌సీబీ ఆరటిలోని ఆద్భుతాలపై పరిశోధన చేయనున్నది. దీనిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రమాదాలు లేని రసాయనాలు కలడం ద్వారా అరటి పీచు నుంచి నూలును వడకవచ్చునని కనుగొన్నారు.
అరటి కాండంలో ఈ లక్షణాన్ని కనుగొన్నారు. అయితే ఈ నూలు కాస్త తక్కువ పొడవు ఉంటుంది. ఇందుకోసం పిలిప్పైన్స్ నుంచి ప్రత్యేక రకం అరటిని తెప్పిస్తున్నారు. ఇందులో పీచు పదార్థామే ఉత్పత్తిగా ఉంటుంది. కాని ఫలాలను ఉత్పాదన ఉండదు.
ఈ నూలును వాణిజ్య రంగంలోనికి ఈ ఉత్పత్తులను దించే ముందు దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. మన్నిక ఎలా ఉంటుంది..? దారం బిగుతు, డయింగ్ రంగు, కుట్టు దక్షతలను పరిశీలిస్తారు. వీటన్నింటిపై పరిశోధనలు పూర్తయిన తరువాత వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు.
అలాగే ఎన్ఆర్‌సిబీ శాస్త్రవేత్తలు అరటి కాండంపై వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నారు. కాండానికి చెందిన రసాన్ని పొడి చేశారు. అందులో చాలా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కిడ్నీలోని రాళ్ళకు మందుగా ఉపయోగపడే అవకాశం ఉందని తేల్చారు. ఇది కాస్త అభివృద్ధి చేసిన తరువాత ఔషధ సంస్థలకు దీనిని బదలాయిస్తారు.
అరటి తోలు నుంచి మద్యం తయారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహరాష్ట్రలోని బెల్గాంకు చెందిన ఓ వ్యాపార సంస్థ పరిశోధనలో చేతులు కలిపింది. పైలట్ ప్లాంట్‌ను త్వరలో ప్రవేశ పెట్టనునున్నారు. ఇవన్నీ జరిగితే అరటి జనానికి నిజంగా బహుళప్రయోజనకారి అనడంలో సందేహం అక్కరలేదు.
|