ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > 'అణు' శాస్త్రవేత్త ప్లాసిడ్ రోడ్రిగస్ కన్నుమూత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'అణు' శాస్త్రవేత్త ప్లాసిడ్ రోడ్రిగస్ కన్నుమూత
FileFILE
ఫోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన అణు శాస్త్రవేత్త డాక్టర్ ప్లాసిడ్ రోడ్రిగస్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. 1998 సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఫోఖ్రాన్ అనే ప్రాంతంలో అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అణు పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షల్లో దేశ అణు శాస్త్ర పితామహుడు డాక్టర్ అబ్దుల్ కలాంతో పాటు రోడ్రిగస్ కూడా కీలక భూమిక పోషించారు.

1940, అక్టోబరు ఐదో తేదీన జన్మించిన రోడ్రిగస్, కేరళ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ‌ డిగ్రీని స్వీకరించారు. ఆ తర్వాత బెంగుళూరులోని ఇడియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ నుంచి లోహధాతు శాస్త్రంలో బీఈ పూర్తి చేశారు. యూఎస్‌ఏలోని టెన్నీస్సీ యూనివర్శిటీ నంచి ఎంఎస్ పూర్తి చేసిన ఆయన ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీని, ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏను డిగ్రీలను అందుకున్నారు.

భారత అణుశక్తి విభాగంలో 1960 సంవత్సరంలో చేరిన ఆయన.. ముంబైలోని బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్‌లో 1974 వరకు విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1974లో తమిళనాడు రాష్ట్రం, కల్పాక్కంలో ఉన్న ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆటోమిక్ రీసెర్స్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. ఇక్కడ రియాక్టర్ రీసెర్చ్ విభాగంలో లోహధాతు పరిశోధనా శాస్త్రవేత్తగా విధులను విజయవంతంగా నిర్వహించిన రోడ్రిగస్. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన లోహధాతు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత కల్పాక్కంలోని ఐజిసీఏఆర్‌ కేంద్రానికి డైరక్టర్‌గా 1992 నుంచి 2000 సంవత్సరం వరకు పని చేశారు. లోహ శాస్త్రంలో ఆయన నిర్వహించిన పరీక్షలు అంతర్జాతీయంగా ఎంతో పేరు సంపాదించి పెట్టాయి. మెకానికల్, వెల్డింగ్, న్యూక్లియర్ మెటీరియల్స్ పరిశోధనల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

దేశ రక్షణ వ్యవస్థ పరిశోధనా సంస్థ అయిన డీఆర్‌డీవోలో రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ కేంద్ర ఛైర్మన్‌గా కూడా ఆయన విధులు నిర్వహించారు. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్రంలో 2000 నుంచి 2003 వరకు పని చేశారు. 2004లో ఆయనకు మద్రాసు ఐఐటి రాజా రామన్న ఫెలోషిప్‌‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా.. నాగ్‌పూర్‌, తిరుచ్చి, కోయంబత్తూరు కళాశాలల్లో గౌరవ ప్రొఫెసర్‌గా కూడా విధులు నిర్వహించారు.

అలాగే.. లోహశాస్త్రం, మెటీరియల్ సైన్స్‌లకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో వెలుపడే పలు పత్రికలకు ఆయన ఎడిటోరియల్ బోర్డు మెంబర్‌‌గా పని చేశారు. 1987-97ల మధ్య ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్‌ లావాదేవీలకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

ఈయన సర్వీసులో ఉండగానే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను, రివార్డులను అందుకున్నారు. వీటిలో కేంద్ర స్టీల్స్ అండ్ గనుల శాఖ ఇచ్చే నేషనల్ మెటాల్యూర్జిస్ట్ డే అవార్డు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ ప్రదానం చేసే జిడి.బిర్లా గోల్డ్ మెడల్, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో వాస్విక్ రీసెర్స్ అవార్డు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్‌ అందించే ప్లాటినమ్ అవార్డు, ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్ అండ్ ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు‌లు ఉన్నాయి. అలాగే పలు పరిశోధనా సంస్థల్లో సభ్యునిగా కూడా ఉన్నారు.

సమాజ సేవలో కూడా డాక్టర్ రోడ్రిగస్ తన వంతు పాత్ర పోషించారు. ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్‌, ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్ అండ్ ఇండియన్ న్యూక్లియర్ సొసైటీలకు తన సేవలను అందించారు. ఇండియన్ నేషనల్ అకాడెమీ ఇంజనీరింగ్‌ గౌరవ కార్యదర్శిగాను, ఉపాధ్యక్షుడిగాను పని చేశారు. అలాగే పలు సంస్థల్లో కూడా సభ్యునిగా ఉన్నారు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మరిన్ని
అరటి పీచుతో వస్త్రాలు....?
ప్రపంచానికి అమ్మ... మదర్ థెరీసా
ముగిసిన సైనిక పాలన: ముషార్రఫ్ నీ దారెటు....?  
మొండి... జగమొండి ముష్... ర్రఫ్
ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వాసుపత్రులు
భారత్‌పై రష్యా కుర్రాడి మమకారం