ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > నాడు 'మిస్టర్ టెన్ పర్సెంట్'.. నేడు దేశాక్షుడు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాడు 'మిస్టర్ టెన్ పర్సెంట్'.. నేడు దేశాక్షుడు
ఈ మధ్యకాలంలోనే జర్దారీపై అవినీతి అరోపణలు వెల్లువెత్తాయి. బేనజీర్‌ ప్రధానిగా అధికారంలో ఉన్న రెండు సందర్భాల్లోనూ పనులు మంజూరు చేసేందుకు, అనుమతుల జారీకి ఆయన పది శాతం ముడుపులు పుచ్చుకునేవారని బహిరంగ విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన జీవితం చీకటి అధ్యాయాన్ని చవిచూసింది. హత్య మొదలుకుని అవినీతి ఆరోపణల వరకు ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఫలితంగా 1997 నుంచి 2004 వరకు ఆయన జైలు జీవితాన్ని గడిపారు. అక్కడ ఆయనను వేధింపులకు కూడా గురిచేయడంతో జర్దారీ మానసికస్థితి దారితప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే తనకు ఇంగ్లాండ్‌లోని సర్రీలో 4.35 మిలియన్‌ పౌండ్ల ఎస్టేట్‌ ఉందని జర్దారీ 2004 ఆగస్టులో అంగీకరించారు. అందులో 20 గదుల భారీ భవనంతో పాటు ఒక్కొక్కటీ 365 ఎకరాలుగా రెండు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి.

ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయినా.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. భార్యకు నీడగా, అండగా ఉండే భర్తగానే వ్యవహరించారు. అటు పార్టీ, ఇటు ప్రజల్లోనూ ఆయన ఇమేజి పోయింది. భుట్టో అనంతరం జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ.. పెద్దగా పాల్గొనలేదు. అయితే.. ఆ పార్టీకి సానుభూతి పవనాలు వీయడంతో ఆ పార్టీ విజయం సాధించింది. దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు ఏర్పాటు చేశారు.

తన నమ్మిన బంటు గిలానీని ప్రధానిగా చేసి, తెరవెనుక చక్రం తిప్పుతూ వచ్చారు. తాజాగా, శనివారం జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అస్థిరతకు కేంద్రబిందువైన పాక్‌లో సుస్థిరత కల్పిస్తారా? నిరాశానిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న పాక్ ప్రజలకు స్వస్థత చేకూరుస్తారా? లేక తనకు లభించే విశేషాధికారాలతో ముషారఫ్‌ను తలపించే నియంతగానే మిగిలిపోతారా? అనే ప్రశ్నలకు భవిష్యత్‌ సమాధానం చెప్పాలి.
<< 1 | 2 
మరిన్ని
'అణు' శాస్త్రవేత్త ప్లాసిడ్ రోడ్రిగస్ కన్నుమూత
అరటి పీచుతో వస్త్రాలు....?
ప్రపంచానికి అమ్మ... మదర్ థెరీసా
ముగిసిన సైనిక పాలన: ముషార్రఫ్ నీ దారెటు....?  
మొండి... జగమొండి ముష్... ర్రఫ్
ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వాసుపత్రులు