ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > పాక్ అధ్యక్షుడిగా జర్దారీకి పెను సవాళ్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్ అధ్యక్షుడిగా జర్దారీకి పెను సవాళ్లు
నూతనంగా ఎన్నికైన పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ మనగలగాలంటే దేశానికి నూతన భవిష్యత్తును సృష్టించాల్సి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాదంతో అట్టుడుకుతుండటమే కాక ఆర్థిక సంక్షోభం రానురాను తీవ్రస్థాయికి చేరుతుండంటంతో అధ్యక్ష పదవి జర్దారీకి కత్తిమీది సాములా ఉండబోతోందని వీరు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న రోజునే పెషావర్ నగర శివార్లలో ఆత్మాహుతి దాడి జరగటం అనేది జర్దారీ భవిష్యత్తులో ఎదుర్కోవలసిన సవాళ్లకు ఓ సంకేతంలా ధ్వనించింది. ఈ ఘటనలో 35 మందికి పైగా ప్రజలు మృతి చెందగా మరో 70 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే.

దేశంలో చాపకింద నీరులా చొచ్చుకుపోతున్న తాలిబాన్ ఉగ్రవాదులే ఈ దాడికి కారకులుగా కనిపిస్తోందని పాకిస్తానీ భద్రతాధికారి పేర్కొన్నారు. కాగా, ఉగ్రవాదుల సవాళ్లు, పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను దివాళా తీస్తున్న నేపథ్యంలో ఈ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు జర్దారీకి అవకాశాలు తక్కువేనని మెజారిటీ పాకిస్తానీలు అభిప్రాయపడుతున్నారని పాక్ రాజకీయ వ్యాఖ్యాత హసన్ అస్కారీ రిజ్వీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జర్దారీకి, నూతన భవిష్యత్తును నిర్మించడమే ప్రధాన సమస్యగా కానుందని రిజ్వీ తెలిపారు. అధ్యక్ష పదవికి తాను ఒక కొత్త దిశానిర్దేశం చేయాల్సి ఉంటుందని, ముందుగా తన గతం నుంచి జర్దారీ వీలైనంత త్వరగా బయటపడాల్సి ఉంటుందని రిజ్వీ అభిప్రాయపడ్డారు.

దేశ నూతన భవిష్యత్తుకు జర్దారీ పునాది వేయలేనట్లయితే తాను తాజా ఆరోపణల బారిన పడటం ఖాయమని రిజ్వీ వ్యాఖ్యానించారు. అమెరికా లాంటి అగ్రదేశాలు, రాజకీయ శక్తులు తనకు మద్దతు అందించాలంటే జర్దారీ నిర్ణయాత్మకంగా ముందడుగు వేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఒక పాశ్చాత్య దౌత్యవేత్త అంగీకరించారు. అప్పుడు మాత్రమే ఆయన దేశ సమస్యల్లో పాలు పంచుకోగలుగుతారని ఈ దౌత్యవేత్త చెప్పారు.

పార్లమెంట్ ఉభయ సభలు మరియు రాష్ట్రాల శాసన సభలలోని 702 మంది ప్రాతినిధ్య సభ్యులకు గాను 482 ఓట్లను పొందిన జర్దారీ భారీ మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎంపికైన విషయం తెలిసిందే.
వీడియోను వీక్షించండి
మరిన్ని
నాడు 'మిస్టర్ టెన్ పర్సెంట్'.. నేడు దేశాధ్యక్షుడు
'అణు' శాస్త్రవేత్త ప్లాసిడ్ రోడ్రిగస్ కన్నుమూత
అరటి పీచుతో వస్త్రాలు....?
ప్రపంచానికి అమ్మ... మదర్ థెరీసా
ముగిసిన సైనిక పాలన: ముషార్రఫ్ నీ దారెటు....?  
మొండి... జగమొండి ముష్... ర్రఫ్