ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > ప్రభాకరన్‌కు రాజీవ్ గాంధీ అరుదైన బహుమతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రభాకరన్‌కు రాజీవ్ గాంధీ అరుదైన బహుమతి
FILE
భారత్-శ్రీలంక మధ్య రక్షణ ఒప్పందం జరిగిన సందర్భంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌కు స్వయంగా తన బుల్లెట్ ప్రూఫ్‌ జాకెట్‌ను బహూకరించిన విషయం సంచలనాత్మక రీతిలో వెలుగు చూసింది. చరిత్రలో రెండు దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న ఈ విశేష వార్త తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బయటపడటం గమనార్హం

భారత శ్రీలంక మధ్య 1987లో శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చర్చలకోసం ఢిల్లీకి వచ్చిన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌కు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అరుదైన బహుమతిని ఇచ్చి గౌరవించారని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ విప్ అల్పోన్స్ ఆ రాష్ట్ర శాసనసభలో చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది
పెద్ద పులికి బుల్లెట్ ప్రూప్...
  చరిత్రలో మరుగున పడిన విశిష్ట వార్తలు కూడా ఏదో ఒక చారిత్రక సందర్భంలో వెలుగు చూస్తాయనడానికి ప్రభాకరన్‌కు రాజీవ్ పురస్కారం వార్తే నిదర్శనం. శ్రీలంక తమిళుల సమస్య జటిలంగా మారిన తరుణంలోనే ఈ విషయం సంచలనాత్మక రీతిలో బయటపడటం విశేషం...      
.


ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత రాజీవ్ తను ధరిస్తూన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ప్రభాకరన్‌కు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారని తమిళ నాడు కాంగ్రెస్ విప్ అల్పోన్స్ పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన శుభ సందర్భంగా రాజీవ్ తమిళపులుల అధినేత ప్రభాకరన్‌ను సాదరంగా ఆలింగనం చేసుకున్నారని చెప్పారు.

కానీ, విషాదకరమైన పరిణామమేమిటంటే ప్రభాకరన్‌కి ప్రాణ రక్షణ కవచాన్ని పురస్కారంగా ఇచ్చిన రాజీవ్ అందుకు తర్వాత భారీ మూల్యాన్నే చెల్లించారని అల్పోన్స్ వాపోయారు. శ్రీలంక తమిళుల ప్రయోజనాలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని రాష్ట్రంలో పలు పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు సత్యదూరమని కాంగ్రెస్ విప్ ఖండించారు.

శ్రీలంక తమిళుల సమస్యలను తొలుతగా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీయే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించారని అందుకు కాంగ్రెస్ పార్టీ భారీ త్యాగానికి సిద్ధపడవలసి వచ్చిందని అల్ఫోన్స్ చెప్పారు. ఆ దెబ్బనుంచి ఈ రోజుకు కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని విచారం వ్కక్తం చేశారు.

భారత ప్రధాని రాజీవ్ గాంధీ, నాటి శ్రీలంక అధ్యక్షుడు జెఆర్ జయవర్ధనేల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారమే భారతీయ శాంతి పరిరక్షక దళం -ఐపికెఎఫ్- 1987లో శ్రీలంక తూర్పుప్రాంత భద్రతను పర్యవేక్షించింది. ఆహ్వానించిన శ్రీలంక పాలకపక్షమే రెండేళ్ల తర్వాత ఛీకొట్టడంతో ఐపికెఎఫ్ అవమానకరంగా స్వదేశం రావలసి వచ్చింది.

తదనంతర పరిణామాలు రాజీవ్ దారుణ హత్యకు దారితీసిన విషయం తెలిసిన విషయమే...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గుడ్లు విసిరిన వారిపై చిరంజీవి గాంధీ గిరి
హంతకుడి హత్యపై ఇంత 'రాజకీయమా'?  
వైఎస్‌కు తృటిలో తప్పిన ప్రాణాపాయం
ఒబామా యంత్రాంగంలో ఎన్నారైలకు పెద్దపీట
మెక్సికోలో జోకర్ల ర్యాలీ  
ఒబామా బారక్‌కు ప్రాణాపాయం!